అమెరికా అధ్యక్ష ఎన్నికలు: ట్రంప్- బిడెన్ మధ్య వాడి వేడి చర్చ, మొత్తం దానిపైనే  

Trump and Biden clash on pandemic, trade personal jabs at final debate America President Elections, Big Debate, Donald Trump, Joe Biden, Coronavirus Vacine, America Financial Crisis, Immunity Power, Obama Care - Telugu America Financial Crisis, America President Elections, Big Debate, Coronavirus Vacine, Donald Trump, Immunity Power, Joe Biden, Obama Care, Trade Personal Jabs At Final Debate, Trump And Biden Clash On Pandemic

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థుల మధ్య చివరి డిబేట్ గురువారం సాయంత్రం జరిగింది.ట్రంప్ కరోనా వైరస్ బారిన పడటంతో రెండో డిబెట్ రద్దయిన విషయం తెలిసిందే.

TeluguStop.com - America President Elections Big Debate Donald Trump Joe Biden Coronavirus Vacine

టెన్నెసీలోని నాష్‌‌విల్లే‌లో డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ మధ్య జరిగిన చర్చ వాడీవేడిగా సాగింది.ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ విరుచుకుపడ్డారు.

ప్రధానంగా కరోనా నిర్వహణ, వ్యాక్సిన్, అమెరికా ఆర్ధిక వ్యవస్థ తదితర అంశాల చుట్టూనే చివరి సంవాదం నడిచింది.

TeluguStop.com - అమెరికా అధ్యక్ష ఎన్నికలు: ట్రంప్- బిడెన్ మధ్య వాడి వేడి చర్చ, మొత్తం దానిపైనే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కోవిడ్‌పై పోరాటానికి ట్రంప్ వద్ద ఓ ప్రణాళిక లేదని ధ్వజమెత్తారు.

కరోనా మరణాలకు కారణమైనవారు ఎవరూ అధ్యక్షుడిగా ఉండటానికి అర్హత లేదని బిడెన్ దుయ్యబట్టారు.ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.

అధ్యక్షుడి హోదాలో వున్న వ్యక్తి వైరస్ ప్రమాదకరమనే విషయాన్ని ప్రజలకు ఎప్పుడూ చెప్పలేదని, ఆందోళన వద్దని చెబుతూ వచ్చారని బిడెన్ మండిపడ్డారు.దీనిపై స్పందించిన ట్రంప్ మరికొద్ది వారాల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని చెప్పారు.

దేశాన్ని లాక్‌డౌన్ చేసే ఉద్ధేశ్యం తమకు లేదని, జో బిడెన్ లాగా అండర్‌గ్రౌండ్‌లో ఉండలేమని ట్రంప్ కౌంటరిచ్చారు.కరోనా వైరస్‌తో సహజీవనం చేయడాన్ని ప్రజలు నేర్చుకున్నారని ఆయన చెప్పారు.

తమ ప్రభుత్వం తీసుకున్న చర్చల వల్ల అంచనాల కంటే తక్కువ మంది చనిపోయారని ట్రంప్ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా బిడెన్ జోక్యం చేసుకుంటూ.

ట్రంప్ ప్రతిస్పందన అత్యంత విషాదకరమని ఓ ప్రముఖ జర్నల్ ప్రచురించిందని తిప్పికొట్టారు.కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవడం అంటే ప్రాణాల కోల్పోడమా అని నిలదీశారు.

తాను కరోనా నుంచి కోలుకున్నట్లుగానే అందరూ బయటపడతారని.అందరికీ రోగనిరోధక శక్తీ ఏర్పడుతుందని ట్రంప్ చెప్పారు.తన హయాంలో ఒబామా కేర్ కంటే మెరుగైన ఆరోగ్య విధానాన్ని తీసుకొచ్చానని, రాబోయే రోజుల్లో ఇంకా మంచి విధానాన్ని రూపొందిస్తామని వెల్లడించారు.బిడెన్ ఇప్పటి వరకు రష్యా నుంచి 3.5 మిలియన్ డాలర్లు తీసుకున్నారని, విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో అనేక అవినీతికి పాల్పడ్డారని విమర్శిస్తూ పరోక్షంగా బిడెన్ కుమారుడిని టార్గెట్ చేశారు ట్రంప్.

దీనిపై స్పందించిన బిడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

అమెరికా సార్వాభౌమాధికారంలో జోక్యం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు.గత 22 సంవత్సరాలుగా చెల్లించిన పన్నుల వివరాలను వెల్లడించానని, నా జీవితంలో విదేశాల నుంచి ఒక్క పైసా కూడా అందుకోలేదని బిడెన్ స్పష్టం చేశారు.

రహస్యంగా ఓ బ్యాంక్ ఖాతాను నిర్వహిస్తున్నారని ఆరోపించారు.కరోనాతో పాటు జాత్యహంకారం, వలస విధానంపైనా ఇద్దరి మధ్యా చర్చ జరిగింది.కాగా ఈ డిబేట్ సందర్భంగా ఒకరి ప్రసంగానికి మరొకరు అడ్డుపడకుండా చర్చలో మైక్‌ను కట్ చేసేలా మ్యూట్ బటన్‌ను ఏర్పాటు చేశారు.దీని వల్ల ఇద్దరు నేతల మధ్య ఎలాంటి రసాభాస చోటు చేసుకోకపోవడం గమనార్హం.

ఒక్కో అంశంపై స్పందించడానికి ఒక్కొక్కరికి రెండు నిమిషాల సమయం కేటాయించారు.

#TrumpAnd #Joe Biden #Big Debate #Obama Care #TradePersonal

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

America President Elections Big Debate Donald Trump Joe Biden Coronavirus Vacine Related Telugu News,Photos/Pics,Images..