అమెరికా : ట్రంప్ కి అధ్యక్షుడు బిడెన్ ఘాటు హెచ్చరిక...నీ ఆటలు సాగావిక

అమెరికా అధ్యక్షుడు బిడెన్ కు మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కోపంతో ఊగిపోయారు.అమెరికాను ప్రశాంతంగా ఉండనివ్వడానికి ట్రంప్ ఇష్టపడటం లేదని, అమెరికా ప్రజల భద్రతా ఏ మాత్రం ట్రంప్ కు పట్టదని విమర్శించారు.

 America: President Biden's Stern Warning To Trump Your Games Are Epic , America,-TeluguStop.com

అంతేకాదు ఇక పై నీ ఆటలు సాగనివ్వను అంటూ తాజాగా బిడెన్ చేసిన ఈ వ్యాఖ్యలతో అమెరికా రాజకీయాలు వేడెక్కాయి.ఇప్పటికిప్పుడు ఉన్న పళంగా ఎందుకు బిడెన్ మాజీ అధ్యక్షుడు ట్రంప్ ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు అనే సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.

వివరాలలోకి వెళ్తే.

అమెరికాలోని ఫిలడెల్ఫియా లో ఇండిపెండెన్స్ హాల్ లో బిడెన్ అమెరికా ప్రజలు ఉద్దేశించి సందేశాన్ని వినిపించారు.

అమెరికన్స్ ఎంతో తెలివైన వారని, నిజాలు ఏమిటనేది వారికి స్పష్టంగా తెలుసునని, అయితే ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ చేస్తున్న దురాగతాలను ఆ పార్టీ కి చెందిన వారు, ట్రంప్ అనుచరులు గుడ్డిగా అనుసరిస్తున్నారని ఇది అమెరికా ప్రజలకు అమెరికా గౌరవానికి ఎంతో నష్టాన్ని తీసుకువస్తాయని బిడెన్ అన్నారు.ట్రంప్ తన మద్దతు దారులతో అమెరికాలో కుట్రలకు ప్రేరేపిస్తున్నారని, వారి వల్ల అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడే అవకాశముందని ఆరోపించారు బిడెన్.

వారికి అమెరికా రాజ్యాంగంపై ఎలాంటి నమ్మకం లేదని అధికారం కోసం రిపబ్లికన్ పార్టీ ఎలాంటి దారుణాలకైనా పాల్పడే అవకాశం ఉండచ్చునని బిడెన్ తెలిపారు.ఇకపై ఇలాంటి దారుణాలను చూస్తూ ఊరుకునే పరిస్థితులు లేవని, ట్రంప్ , ఆయన అనుచరుల ఆటలు సాగానివ్వనని అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసగించారు బిడెన్.

నాయకుడిని అనుసరించడంలో తప్పు లేదని కానీ ట్రంప్ లాంటి వ్యక్తిని గుడ్డిగా అనుసరిస్తే తోటి అమెరికన్స్ పై అది తీవ్ర ప్రభావం చూపుతుందని అలాంటి సమయంలో తాను చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు.ఇదిలాఉంటే ఉన్నపళంగా బిడెన్ ట్రంప్ పై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం పై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

భవిష్యత్తులో ట్రంప్ ఎలాంటి దుశ్చర్యలకైనా పాల్పడానికి సిద్దంగా ఉన్నాడా అందుకే ముందుగానే బిడెన్ హెచ్చరించారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube