ఉగ్రవాది మరణ శిక్షను రద్దు చేసిన పాక్ కోర్టు,కరోనానే కారణమా!

ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారుతున్న పొరుగు దేశం పాకిస్తాన్ మరో సారి తన ఉగ్రబంధాన్ని చాటుకుంది.పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఒక స్థావరంగా మారింది అంటూ అగ్రరాజ్యం అమెరికా సైతం మండిపడిన పాకిస్థాన్ మరోసారి ఉగ్రవాదుల విషయంలో తన బంధాన్ని చాటుకుంది.

 Pakistan Court Overturns Conviction In 2002 Killing Of Daniel Pearl, America, Pa-TeluguStop.com

ఒక ఉగ్రవాదికి విధించిన మరణ శిక్షను రద్దు చేస్తూ అక్కడి కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.అయితే ఈ నిర్ణయం వెనుక కరోనా ఉదంతం ఉంది అనుకుంటే పొరపాటే.

పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఊతమిస్తుంది అంటూ పొరుగు దేశాలు ఆరోపిస్తున్నట్లే మరోసారి ఉగ్రవాదులకు తమ దేశం అండగా నిలుస్తుంది.

Telugu America, Americadpnald, Omar Terrirost, Pakisthan-General-Telugu

అన్న విషయాన్నీ ఈ ఉగ్రవాది విషయం నిరూపించుకుంది.భారత్ తో పాటు పలు దేశాల్లో హత్యలు,కిడ్నాపులు,హైజాక్ లకు పాల్పడిన కరుడుగట్టిన అహ్మద్ ఒమర్ షేక్ సయూద్ అనే ఉగ్రవాదికి విధించిన మరణ శిక్షను రద్దు చేస్తూ ఏడేళ్ల సాధారణ ఖైదుగా మార్చడం విశేషం.ఒమర్ మనదేశంలోని ఘజియాబాద్ జైల్లో కొన్నేళ్లు శిక్ష అనుభవించాడు.

అమెరికాకు చెందిన డేనియల్ పెర్ల్ అనే జర్నలిస్టును చంపిన కేసులో 18 ఏళ్లుగా జైల్లో ఉన్నాడు.అతనికి ఈ కేసులో విధించిన మరణదండనను ఇలా సాధారణ శిక్షగా మారుస్తూ పాక్ లోని సింధ్ కోర్టు గురువారం తీర్పు నివ్వడం చర్చనీయాంశంగా మారింది.

దీనిపై అగ్రరాజ్యం అమెరికా సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.మరణశిక్షను ఇన్నాళ్లూ అమలు చేయకుండా ఇప్పుడు రద్దు చేసి ప్రమాదకర సంకేతాలు పంపారంటూ అమెరికా మండిపడింది.

వాల్ స్ట్రీట్ జర్నల్ కు చెంది పెర్ల్‌ను ఒమర్ ముష్కర ముఠా 2002లో కిడ్నాప్ చేసి చంపేసింది.

అంతేకాకుండా భారత పర్యాటకుల కిడ్నాప్,కాందహార్ విమాన హైజాక్ వంటి తదితర కేసులు అతనిపై ఉన్నప్పటికి భారత ప్రభుత్వం అతడిని వదిలిపెట్టింది.

పాకిస్థాన్ ఉగ్రవాదులకు స్వర్గధామం గా మారింది అంటూ గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.ఈ క్రమంలోనే పాక్ కు అందించే ఫండ్స్ ను కూడా ఆపివేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube