మానవత్వాన్ని చాటి చెప్పిన అమెరికా దంపతులు...!!!

అమెరికాకి చెందిన ఇద్దరు దంపతులు మానవత్వం చాటారు.తెలంగాణలో ఉభయలింగత్వం తో పుట్టిన పాపని దత్తతు తీసుకున్నారు.

 America Nri Couple Adopted Telangana Child-TeluguStop.com

తమతో అమెరికా తీసుకువెళ్ళి అక్కడ ఆమెకి ఏ లోటు లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.అంతేకాదు ఆ పాపకి అన్ని విధాలా పరీక్షలు చేసి లింగ నిర్దారణ చేసుకున్న తరువాత ఆమెకి ఆపరేషన్ చేయిస్తామని తెలిపారు.

పూర్తి వివరాలలోకి వెళ్తే.

మానవత్వాన్ని చాటి చెప్పిన అమ�

తెలంగాణా రాష్ట్రం హైదరాబాద్ లో అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్న ఓ పాపని కాపాడిన ఓ సంస్థ ఆ పాప ఆలనా పాలనా చూస్తోంది.ఆమె గురించి పలు విధాలుగా దత్తత ఇవ్వాలని చూసినా ఎవరూ ముందుకు రాలేదు.ఈ క్రమంలోనే అమెరికాలోని వాషింగ్టన్ కి చెందిన భార్య భర్తలు ఈ విషయం తెలుసుకుని ఆ పాపని దత్తత తీసుకోవానికి ముందుకు వచ్చారు.

మానవత్వాన్ని చాటి చెప్పిన అమ�

అమెరికాలో వారు ఇరువురు ఉన్నత ఉద్యోగాలు చేసుకుంటున్నారు.హైదరాబాద్ వచ్చి పాపని తీసుకు వెళ్ళిన ఆ దంపతులు, సదరు సంస్థ పెట్టిన నిభంధనల ప్రకారం పాప యొక్క రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు ఆరునెలలకి ఒక సారి పంపించాల్సి ఉంటుందని చెప్పడంతో వారు కూడా ఆరు నెలలకి ఒకసారి పాప గురించి పూర్తి వివరాలు పంపుతామని అంగీకరించి పాప యొక్క వివరాలని సదరు సంస్థకి పంపుతున్నారు.కన్న తల్లి తండ్రులకి భారమైన ఆ పాప ఇప్పుడు అమెరికాలో మంచి మనసున్న భార్యా భర్తల వద్దకి చేరుకోవడం సంస్థ సభ్యులు ఎంతో సంతోష పడుతున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube