ఆ అమెరికా ప్రొఫెసర్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..ఎందుకంటే..!!!

కరోనా మహమ్మారి ఒకరి నుంచీ మరొకరికి ఎంతో సులువుగా సోకుతోంది.ఎవరికైనా కరోనా సోకిందని తెలిస్తే మనం కనీసం ఆ చుట్టుపక్కలకి కూడా వెళ్ళం.ఎక్కడ మనకి కరోన సోకుతుందోనని భయం వెంటాడుతుంది.కరోనా వైరస్ నుంచీ కోలుకున్న వ్యక్తితో మాట్లాడాలన్నా మాట్లాడలేము ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నది తీరు ఇదే.ఎవడి ప్రాణాలు వాళ్లకి ముఖ్యమే.కానీ కరోనా తో చనిపోయిన వ్యక్తి వద్దకి వెళ్లి వారికి దహన సంస్కారాలు చేయడానికి ఎవరైనా సాహసిస్తారా.?? అస్సలు చేయరు చచ్చినా చేయరు.అది ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టే చర్య.

 America, Corona Virus, New York, Cold Storage, Crematoriums, David Penepent, Stu-TeluguStop.com

కానీ అమెరికాలలోని న్యూయార్క్ కి చెందిన ఓ ప్రొఫెసర్ కరోనా మృతలకి దహన సంస్కారాలు దగ్గర ఉండి మరీ చూసుకుంటున్నారు.శుభకార్యానికి వెళ్ళాక పోయినా పరవాలేదు కానీ ఇలాంటి మంచి పనికి తప్పకుండా వెళ్లి తీరాలని అంటున్నారు.

అమెరికాలో ప్రతీ రోజు వేల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి.దాంతో రాష్ట్రాలలో ఉన్న క్రిమోటోరియంలకి క్షణం తీరిక లేదు.వరుసగా మృతు దేహాలు వస్తూనే ఉన్నాయి దాంతో కాళీలు లేక చాలా మృత దేహాలు కోల్డ్ స్టోరేజ్ లో ఉంచేస్తున్నారు.

Telugu America, Storage, Corona, Crematoriums, David, York-

ఈ పరిస్థితిని గమనించిన డేవిడ్ పెనేపేట్ అనే మార్చురీ సైన్స్ ప్రొఫెసర్ ఆయన దగ్గర చదువుతున్న ఇద్దరు విద్యార్ధులు కలిసి ఓ వ్యాన్ లో కోల్డ్ స్టోరేజ్ లో ఉన్న మృతదేహాలని తీసుకుని హైవేలో ఇతర రాష్ట్రాలకి వెళ్లి అక్కడ ఉన్న మోటోరియంలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.చనిపోయిన వారి భందువులకి మేము ఉన్నామంటూ సాయం అందిస్తున్నారు.దాంతో సదరు ప్రొఫెసర్ అమెరికా ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube