అమెరికా కీలక నిర్ణయం..నవంబర్ 8 నుంచీ అమలు...వారి విషయంలో మాత్రం నో క్లారిటీ...

ఎన్నాళ్ళో వేచిన ఉదయం.ఈనాడే ఎదురవుతుంటే అన్నట్టుగా ఉంది అమెరికా వెళ్ళాలనుకునే వారి ప్రస్తుత పరిస్థితి.

 America New Rules On Passengers, America New Rules, Rtpcr Test, Covid Rules, Ame-TeluguStop.com

అమెరికాకు వెళ్లాలని నెలల తరబడి కరోనా నిభంధనల కారణంగా ఉండిపోయిన ఎంతో మంది వలస వాసులకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది.కరోనా నేపధ్యంలో అమెరికాలోకి వచ్చే వారు వ్యాక్సిన్ తీసుకుని వస్తే చాలని ప్రకటించింది.

అయితే ఈ ప్రకటనను గత నెలలోనే చేసినా కార్యరూపం దాల్చలేదు.కానీ తాజాగా అమెరికా నవంబర్ 8 నుంచీ వలస వాసులు తమదేశంలోకి రావచ్చునని ప్రకటించింది.

ఈ మేరకు వైట్ హౌస్ అధికారి మీడియాకు వెల్లడించారు.
కరోనా నేపధ్యంలో ఇప్పటి వరకూ అమెరికా విదేశీయులను తమ దేశంలోకి వచ్చేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు ముఖ్యంగా కరోనా తీవ్ర ప్రభావం చూపించిన భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాల విషయంలో ఎంతో కటినంగా వ్యవహరించింది.

అయితే కొత్త నిభందనలు అమలు లోకి వచ్చిన తరువాత ఏ దేశ వాసులైనా సరే నూతన నిభంధనలను అనుసరించి తమ దేశంలోకి అడుగు పెట్టవచ్చని తెలిపింది.అయితే తమ దేశంలోకి వచ్చేవారు ప్రయాణానికి 72 గంటల ముందుగా ఆర్టీ పీసిఆర్ టెస్ట్ చేయించుకోవాలని అందులో నెగిటివ్ వస్తే అమెరికా రావచ్చని తెలిపింది.ఇదిలాఉంటే

వ్యాక్సిన్ తీసుకొని అమెరికావాసులు ఎవరైనా ఉంటే వారు ప్రయాణానికి ముందు కరోనా పరీక్షలు చేయించుకోవాలి అందులో నెగిటివ్ వస్తేనే అమెరికాలోకి అడుగు పెట్టేందుకు అనుమతులు ఇస్తారు.ఇక అనుమతులు ఉన్న వ్యాక్సిన్ లు తీసుకున్న వారికి మాత్రమే అమెరికాలోకి వచ్చేందుకు అనుమతి ఉందనే నిభందన కూడా ఉండటంతో వలస వాసులు ఈ విషయంపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇక కొందరు ఒక డోస్ ఒక రకం వ్యాక్సిన్ రెండవ డోస్ మరొక కంపెనీ వ్యాక్సిన్ తీసుకున్న వారి విషయంలో అనుమతులు ఉన్నాయా అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తోంది.ఏది ఏమైనా నెలల తరబడి అమెరికా ప్రయాణం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న వారికి అమెరికా తాజా ప్రకటన పెద్ద ఊరటను ఇచ్చిందనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube