అమెరికా భారీ ప్రాజెక్ట్...డైరెక్ట్ ఎనర్జీ ఫ్యూచర్ -2060..!!

అదృశ్య కవచం ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా.అవును కొన్ని రోజుల క్రితం ఇజ్రాయిల్ పై దాడులు జరిగినపుడు ఆ దేశం ఉపయోగించిన అత్యాధునిక టెక్నాలజీ ఇది.

 America New Project Direct Energy Future -2060 Iron Dome , Israel Iron Drome, Di-TeluguStop.com

హామస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై చేసిన రాకెట్ దాడులను నిలువరించడానికి వాటిని సమర్ధవంతంగా తిప్పి కొట్టేందుకు ఇజ్రాయిల్ ఐరన్ డ్రోమ్ ను ఉపయోగించి దాదాపు 300 రాకెట్స్ ను గాలిలోనే పేల్చేసింది.శత్రువుల నుంచీ తమను తాము రక్షించుకునేందుకు ఈ టెక్నాలజీ ను వినియోగించినట్టుగా తెలిపిన ఇజ్రాయిల్ అందరి దృష్టిని ఆకర్షించింది.

అయితే ఇజ్రాయిల్ ఐరన్ డ్రోం కంటే కూడా 100 రెట్లు అత్యంత శక్తివంతమైన రక్షణ కవచాన్ని రూపిందించే పనిలో పడింది అమెరికా.టార్గెట్ 2060 చేసుకుని డైరెక్ట్ ఎనర్జీ ఫ్యూచర్ -2060 పేరుతో రూపిందిస్తున్న అదృశ్య కవచం అమెరికాలోని 50 రాష్ట్రాలను కాపాడుతుందని, అమెరికాలోని అటవీ ప్రాంతాలు, వైట్ హౌస్, క్యాపిటల్ భవనం, అమెరికా రక్షణ శాఖ కార్యాలయం తో పాటు పెంటగాన్ తో పాటు అన్ని ప్రాంతాలను ఈ అదృశ్య కవచం కాపాడుతుందట.

శత్రు దేశాలు తమపై ఎలాంటి రాకెట్లు, అణువాయుధాలు, ప్రయోగించినా, ఎంతటి శక్తివంతమైన విమానాలు, ప్రయోగించినా గాలిలోనే క్షణాలలో పెల్చేయగల సామర్ధ్యానికి తగ్గట్టుగా ఓ భారీ రక్షణ కవచాన్ని సృష్టించనున్నారు.ఇందులో భాగంగానే ఫోర్స్ ఫీల్డ్ ప్రాజెక్ట్, డైరెక్ట్ ఎనర్జీ ఫ్యూచర్ -2060 పేరుతో అమెరికా ఎయిర్ ఫోర్స్ రీసెర్చ్ లాబొరేటరీ ఇందుకు సంభందించిన వివరాలు వెల్లడించిందని తెలుస్తోంది.

ఈ రక్షణ కవచం సామార్ధ్యం దాదాపు 300 నుంచీ 400 కిలోమీటర్ల పరిధి వరకూ ఉంటుందట.ఇప్పుడు ఇదే సామర్ధ్యం గల రక్షణ డ్రోమ్స్ ను భారత ప్రభుత్వం కూడా కొనుగోలు చేయడానికి యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube