స్పూర్తి: మొక్కవోని దీక్ష, మూడో ప్రయత్నంలో బైడెన్ విజయ బావుట

గెలుపు అంత తేలికగా రాదు.అందుకోసం ఎంతో శ్రమించాలి.

 Third White House Run Lucky For Joe Biden, Joe Biden, America Elections, White H-TeluguStop.com

మధ్యలో ఓటములు, సవాళ్లు, అవమానాలు, చీత్కారాలు ఎన్ని ఎదురైనా పట్టుదలతో దానిని సాధించాలి.ఇప్పుడే దీనిని ఆచరణలో సాధించి చూపారు అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్.

ఐదు దశాబ్దాలుగా అమెరికా రాజకీయాల్లో కొనసాగుతున్న జో బైడెన్‌ కల ఎట్టకేలకు నెరవేరింది.శ్వేతసౌథాన్ని సొంతం చేసుకోవటానికి మూడుసార్లు ప్రయత్నించిన ఆయన ఎట్టకేలకు విజయం సాధించారు.

తద్వారా అమెరికా చరిత్రలో పిన్నవయస్కులైన సెనేటర్లలో ఒకడిగా రికార్డు సృష్టించిన బైడెన్‌ ఇప్పుడు అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా మరో రికార్డు నెలకొల్పబోతున్నారు.ఆయన గతంలో ఆరుసార్లు సెనేటర్‌గా ఎన్నికయ్యారు.

ఒకసారి 1988లో, రెండోసారి 2008లో డెమొక్రటిక్ పార్టీ టికెట్ కోసం జరిగే పోటీల నుంచి తప్పుకున్న బైడెన్.ఈసారి టికెట్ కోసం బరిలోకి దిగేటపుడే ఫ్రంట్ రన్నర్‌గా ఉన్నారు.

పార్టీ నామినేషన్ దక్కించుకున్న ఆయన తనతో పాటు ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థిగా కమలా హారిస్‌ను ఎంపిక చేసుకున్నారు.ఒకదశలో ఆమె కూడా అధ్యక్ష పదవి టికెట్ కోసం పోటీ పడ్డారు.

నిజానికి 2008 అధ్యక్ష ఎన్నికల్లో బరాక్ ఒబామా పార్టీ నామినేషన్ గెలుచుకున్నపుడు.ఆయన తనతో పాటు ఉపాధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయటానికి జో బైడెన్‌ను ఎంపిక చేసుకున్నారు.

ఆ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత 2012 ఎన్నికల్లోనూ ఒబామా, బైడెన్ ద్వయం గెలిచింది.అలా రెండు సార్లు అమెరికా ఉపాధ్యక్షుడిగా బైడెన్ పనిచేశారు.

అమెరికా ఉపాధ్యక్షుల్లో ‘అత్యుత్తమ ఉపాధ్యక్షుడు’ అని బైడెన్‌ను కీర్తించారు.ఒబామా అధ్యక్షుడిగా ఉన్న ఎనిమిదేళ్ల కాలం ఉపాధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్.

తమ హయాంలో అమలు చేసిన అఫర్డబుల్ కేర్ యాక్ట్ వంటి పథకాల్లో చాలా భాగం తన కృషి ఫలితమేనని చెబుతారు.

Telugu America, Barack Obama, Joe Biden, Whiterun, White-Telugu NRI

అయినప్పటికీ.బైడెన్ నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం మీద తీవ్ర విమర్శలూ ఉన్నాయి.1991లో సెనేట్ జ్యుడీషియరీ కమిటీ అధ్యక్షుడిగా.సుప్రీంకోర్టుకు నామినేట్ అయిన క్లారెన్స్ థామస్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ అనిటా హిల్ ఆరోపణలపై విచారణను నిర్వహించిన తీరు కారణంగా తీవ్ర విమర్శల పాలయ్యారు.ఈ విచారణ కమిటీలో అందరూ తెల్లజాతీయులైన పురుషులే సభ్యులుగా ఉన్నారు.అనిటా హిల్‌కు మద్దతుగా నిలిచిన పలువురు మహిళలను బైడెన్ సాక్ష్యం చెప్పడానికి పిలవలేదు.2019 ఏప్రిలో ఒక టీవీ ఇంటర్వ్యూలో ఈ కేసు గురించి మాట్లాడుతూ బైడెన్… “ఆవిడతో వ్యవహరించిన విధానానికి సిగ్గుపడుతున్నాను” అని చెప్పారు.

వ్యక్తిగత జీవితం:

జో బైడెన్ పూర్తి పేరు జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్.ఆయన 1942 నవంబర్ 20న పెన్సిల్వేనియాలోని స్క్రాంటన్‌లో జన్మించారు.యూనివర్సిటీ ఆఫ్‌ డెలావర్‌లో చదివారు.1968లో సైరకాస్‌ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు.మొదటిసారిగా 1972లో డెలావర్‌ రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికయ్యారు.అప్పుడాయన వయసు 29 సంవత్సరాలు.తద్వారా దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన సెనేటర్‌గా రికార్డుల్లోకెక్కారు.36 ఏళ్ల పాటు సెనేటర్‌గా, ఎనిమిదేళ్ల పాటు ఉపాధ్యక్షుడుగా సేవలు అందించారు. బైడెన్ రాజకీయ జీవితంపై వ్యక్తిగత విషాద ఘటనలు కూడా ఎంతో ప్రభావం చూపాయి.జో బైడెన్ 1972లో మొదటిసారి సెనేటర్‌గా ఎన్నికైన కొద్ది రోజులకే ఒక కారు ప్రమాదంలో ఆయన మొదటి భార్య, కూతురు మరణించారు.

ఆ రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ తన ఇద్దరు కొడుకులు బ్యూ, హంటర్‌లను చూసుకుంటూ ఆస్పత్రిలో ఉన్న ఆయన అక్కడి నుంచే సెనేటర్‌గా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు.అయితే.2015లో బైడెన్ కొడుకు 46 ఏళ్ల బ్యూ బ్రెయిన్ కేన్సర్‌తో మరణించారు.అందుకే, ఆయన తన విధాన లక్ష్యాల్లో ఆరోగ్యం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.

Telugu America, Barack Obama, Joe Biden, Whiterun, White-Telugu NRI

లైంగిక వేధింపులు:

గత సంవత్సరం 8 మంది మహిళలు బిడెన్ తమతో అనుచితంగా ప్రవర్తించారని, తాకరాని చోట తాకి కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం లాంటి పనులు చేశారనే ఆరోపణలు చేశారు.బిడెన్ ఆఫీసులో పని చేసిన తార రీడ్ అనే ఉద్యోగి 30 సంవత్సరాల క్రితం ఆయన తనని లైంగిక వేధింపులకు గురి చేశారని మార్చ్ నెలలో ఆరోపించారు.బిడెన్ ఈ ఆరోపణని ఖండించారు.

2021 జనవరిలో వైట్ హౌస్‌లోకి అడుగుపెట్టబతున్న 77 ఏళ్ల జో బైడెన్ ఇప్పుడు అమెరికాకు 46వ అధ్యక్షునిగా అసలు సిసలు సవాళ్లు ఎదుర్కోబోతున్నారు.ఇప్పటివరకూ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన వారిలో అతి పెద్ద వయస్కుడు ఈయనే.సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో వైట్ హౌస్ పీఠం కోసం బైడెన్ ఎంతో సంఘర్షణకు గురయ్యారు.

కానీ ఆయనకు అత్యంత కఠినమైన సవాళ్లు ముందు ముందు ఇంకా మిగిలే ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube