అమెరికాలో కరోనా మరణాల సంఖ్య రోజు రోజుకు తీవ్రస్థాయికి చేరుకుంటోంది.ట్రంప్ చేసిన పాపం ఇప్పుడు అమెరికాను పట్టి పీడిస్తోంది.
ట్రంప్ నిర్లక్ష్యం ఖరీదు లెక్కగట్టడానికి కూడా సరిపోదంటే ఏ స్థాయిలో కరోనా మహమ్మారి ప్రభావం అమెరికాపై ఉందనేది అర్థం చేసుకోవచ్చు.అగ్ర రాజ్యాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని ఇప్పుడు తాజాగా ఎన్నికైన కొత్త అధ్యక్షుడు బిడెన్ ఎదుర్కోవడం అతిపెద్ద సవాల్ అనే చెప్పాలి.
తాజాగా అమెరికాలో కరోనా మరణాలు రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా కోల్పోయిన సైనికుల కంటే ఎక్కువగానే నమోదయ్యిందని తాజాగా గణాంకాలు చెప్తున్నాయి.
అమెరికాలో కరోనా మహమ్మారి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచీ ఏ రోజు కూడా కరోనా మరణాలు, కేసుల సంఖ్య లెక్కలలోకి రాని రోజు లేదు.
జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ కరోన కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 4,24,000 కు చేరుకుందని రెండవ ప్రపంచ యుద్దంలో చనిపోయిన వారి సంఖ్య తో పోల్చుకుంటే కరోన మరణాలే ఎక్కువని అంటున్నారు పరిశోధకులు.ఇదిలాఉంటే అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ ఇప్పటికే కరోనాను కంట్రోల్ చేసేందుకు ప్రణాళికలు మొదలు పెట్టేశారు.
అధ్యక్షుడిగా ఎన్నిక కాగానే ప్రతీ ఒక్కరూ 100 రోజుల పాటు మాస్క్ ధరించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు.
కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటూ పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు కూడా చేశారు.గత ప్రభుత్వ హయాంలో అమెరికాకు వచ్చే వారు ఎవరైనా సరే
కరోనా నెగిటివ్ సర్టిఫికెట్
తీసుకు రావాల్సిందేనని షరతులు విధించారు.అయితే బిడెన్ ఆదేశాల ప్రకారం.
అమెరికా ఎవరు వచ్చినా నెగిటివ్ సర్టిఫికెట్ తో పాటుగా క్వారంటైన్ లో ఉండాల్సిందేనని ఆదేశించారు.ఇదిలాఉంటే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ లెక్కల ప్రకారం రానున్న రోజుల్లో అంటే కేవలం ఒక్క నెల కాలంలో కరోన కారణంగా మృతి చెందిన వారి సమాఖ్య 5 లక్షల మార్క్ చేరుతుందని తెలుస్తోంది.
ప్రస్తుతానికి కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 4,24,000 చేరుకోగా, కరోన భారిన పడిన వారి సంఖ్య 2,5400000 లకు చేరుకుంది.