అమెరికాలో “ముద్దుల” దినోత్సవం...భారత్ కు లింకు పెడుతున్న పరిశోధకులు..!!

అగ్ర రాజ్యం అమెరికా రకరకాల దినోత్సవాలను జరుపుకుంటుంది, అన్నిటికంటే కూడా అమెరికా సాంప్రదాయంగా థాంక్స్ గివింగ్ డే ను భారీ స్థాయిలో నిర్వహించుకుంటుంది.అలాగే కిస్సింగ్ డే ను కూడా అమెరికా ప్రతీ ఏటా జూన్ -22 న నిర్వహిస్తుంది.

 America Celebrating National Kissing Day, Kissing Day History, Kissing Day Story-TeluguStop.com

ఈ వేడులకలు భారీ స్థాయిలో ప్రజలు హాజరవుతారు.ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలకు పరిమితమైన ఈ కిస్సింగ్ డే ఇప్పుడు దాదాపు అన్ని దేశాలకు పాకుతోంది.

అంతేకాదు కిస్సింగ్ డే ను నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో వివిధ రోజుల్లో జరుపుకోవడం కూడా ఆనవాయితీ అయ్యిపోయింది.

కిస్సింగ్ డే రోజున లవర్స్ ఘాడంగా గనుకా ముద్దు పెట్టుకుంటే వారు పెళ్లి మొదలు దాంపత్య జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతుందని, వారి ఇద్దరి మధ్య బాండింగ్ ఒక్క కిస్ ద్వారా సెట్ అవుతుందని ఇది సైంటిఫిక్ గా కూడా నిరూపితమైందని, అమెరికా పరిశోధకులు తెలుపుతున్నారు.

ఈ ముద్దుల పండుగపై కొందరు మాత్రం వ్యతిరేకత ప్రదరిస్తూనే ఉంటారు.సాంప్రదాయాలకు విరుద్దంగా ఈ వేడుకలను జరుపుకోవడం మంచి పరిణామం కాదని వారు హెచ్చరిస్తున్నారు.అయితే

Telugu America, Americanational, Day, Day Story, National Day-Telugu NRI

ఈ కిస్సింగ్ డే ఇప్పటికి ఇప్పుడు పుట్టింది కాదని 19 శతాబ్దం లోనే మొదలయ్యిందని కొందరు వాదిస్తుంటే కాదు కాదు రోమన్ కాలం నుంచీ ఈ సాంప్రదాయం ఉందని చరిత్ర కారులు అంటున్నారు.మరొకొందరు పరిశోధకులు మాత్రం క్రీస్తు పూర్వం 326 లో అలగ్జాండర్ హాయాం నుంచీ ఈ పద్దతి కొనసాగిందని వాదిస్తున్నారు .ఇక ఇంకొంతమంది పరిశోధకులు అని చెప్పుకునే వాళ్ళు అసలు ఈ ముద్దుల పండుగ భారత్ నుంచీ మనకు వచ్చిందని, పూర్వం భారత్ లో ఈ పండుగలు జరుపుకునే వారని, వేదాల్లో సైతం ఈ విషయంపై ప్రస్తావన ఉందని వాదిస్తున్నారు.ఏది ఏమైనా ఎంతమంది ఈ సాంప్రదాయానికి మద్దతు పలుకుతున్నారో, అన్తెమంది వ్యతిరేకత కూడా వ్యక్తం చేయడం గమనార్హం.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube