అమెరికాలో భారతీయ విద్యార్ధులకి ఊరట..!!!

అమెరికాలో అక్రమంగా నివసించే విద్యార్ధులని అరికట్టే ఓ ప్రతికూల వీసా విధానన్ని ట్రంప్ ప్రభుత్వం ప్రవేసపెట్టిన విషయం విధితమే.అయితే ఈ వీసాపై ఉన్న ఆంక్షలని తాత్కాలికంగా ఆపుతున్నట్టుగా అమెరికా జిల్లా కోర్టు తీర్పు జారీ చేసింది.

 America Makes Changes In Visa-TeluguStop.com

దాంతో అమెరికా యూఎస్‌సీఐఎస్ (అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్ సేవల సంస్థ) కి పెద్ద షాక్ ఇచ్చినట్టుగా అయ్యిందని అంటున్నారు పరిశీలకులు అయితే ఈ కేసు విచారణ ఇంకా పూర్తి కానప్పటికీ ప్రస్తుతం జారీ అయిన తాత్కాలిక ఆదేశాలతో అమెరికాలో చదువుతున్న దాదాపు రెండు లక్షల మంది భారతీయ విద్యార్థులకు ఊరట లభించనుంది

గత సంవత్సరం ఆగస్టు 9 నుంచి అమలులోకి వచ్చిన యూఎస్‌సీఐఎస్ విధానం ప్రకారం చూస్తే.అమెరికాలో అక్రమంగా ఉంటున్న విద్యార్ధులని నిర్దిష్ట కాలం వరకూ మళ్ళీ అమెరికాలో అడుగుపెట్టకుండా నిషేధం విదిస్తారు.180 రోజులు అక్రమంగా నివసించిన వారిపై దాదాపు మూడేళ్ళు నిషేధం ఉంటుంది.ఏడాదికి పైగా నివసించిన వారికి పదేండ్ల నిషేధం ఉంటుందని తెలుస్తోంది.

అయితే ఈ నిషేధం సదరు విద్యార్ధులపై ఆధారపడిన భార్యా పిల్లలకి కూడా వర్తిస్తుందని తెలియడంతో

ఈ తతంగంపై చాలా కాలీజీలు కోర్టును ఆశ్రయించాయి.విదేశీ విద్యార్ధుల హక్కులని కాపాడాలని సూచించాయి.

ఇదిలాఉంటే అమెరికాలో ఉండేందుకు అనుమతించిన కాలం పూర్తి కాకపోయి నా లేక విద్యార్ధి తెలిసో తెలియకో తన వీసా ఉల్లంఘన చేసినట్టయితే ఆరోజు నుంచీ అతడు అక్రమంగా అమెరికాలో ఉంటున్నట్టుగా పరిగణిస్తారు.ఈ పరిస్థితులనే పలు కాలీజీలు విద్యార్ధులు కోర్టుకు విన్నవించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube