అమెరికాలో యువకుడి బీభత్సం..నలుగురు మృతి..!!!

అమెరికాలోని లాస్ఏంజిల్స్ లో దారుణం చోటుచేసుకుంది.ఒక్క సారిగా ఊహించని విధంగా ఓ దుండగుడు ఓ మార్ట్ లోకి వచ్చి విచక్షణా రహితంగా కత్తితో గాయపరిచి సుమారు నలుగురి మృతికి కారణం అయ్యాడు.

 America Loss Angels Man Grove Super Mart-TeluguStop.com

అంతేకాదు పలువురుని గాయపరిచి చివరికి పోలీసుల చేతికి చిక్కాడు.ఈ ఘటన మాన్ గ్రోవ్ సిటీలో ఓ మార్ట్ లో జరిగింది.

వివరాలలోకి వెళ్తే.

అమెరికాలో యువకుడి బీభత్సంనల

మాన్ గ్రోవ్ సిటీలోని ఓ సూపర్ మార్ట్ లోకి ఒక్క సారిగా వచ్చిన దుండగుడు అక్కడ క్యాష్ కౌంటర్ లో ఉన్న వ్యక్తికి కత్తి చూపించి అందులోని సొమ్ముని కాజేశాడు.ఆ మార్ట్ బయట ఉన్న సెక్యూరిటీ వద్దకి వెళ్లి అతడిని కత్తితో పొడిచి చంపి అతని వద్దనున్న గన్ తీసుకుని పారిపోయాడు.ఇలా ఆ దుండగుడు పలు దుకాణాలలో బెదిరింపులకి దిగుతూ హత్యలు చేస్తూ అందిన కాడికి దోచుకుని వెళ్ళిపోయాడు.

అమెరికాలో యువకుడి బీభత్సంనల

పోలీసులు అందుకున్న సమాచారం మేరకు అతడి కోసం గాలించగా ఓ మార్ట్ బయట నుంచీ లోపలి వెళ్తున్న అతడిని చుట్టుముట్టి అతడి నుంచీ కత్తి, గన్ తీసుకుని అరెస్ట్ చేశారు.సంచారం అందిన వెంటనే పోలీసులు రావడంతో ప్రమాదం భారీ స్థాయిలో జరగలేదని, లేకపోతే అతడు మరింతమందిని బలి తీసుకునే వాడని అంటున్నారు పోలీసులు.అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభిచినట్లుగా స్థానిక మీడియా తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube