అమెరికాలో ఓ మహిళ వినూత్న ఆలోచన..అదిరిపోయిందిగా..!!!

అగ్ర రాజ్యం అమెరికా కరోనా కోరల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయం విధితమే.పేరుకి అగ్ర రాజ్యమైనా కనీసం కరోనా నుంచీ జాగ్రత్తలు పడే శానిటైజర్స్, మాస్కులు ప్రజలకి అందించే విషయంలో మాత్రం పేద రాజ్యంలా మారిపోయింది.

 Deb Siggins , America, Face Masks. Decoration,knit And Hung Up 400 Face Masks-TeluguStop.com

వైద్యులకి వైద్య సిబ్బందికి సైతం మాస్కులు అందించలేని పరిస్థితిలో ఉంది అగ్ర రాజ్యం ఉంది.దాంతో చాలా మంది ప్రజలు మాస్కులు దొరకక అలాగే రోడ్లపైకి వచ్చేస్తున్నారు.


ఈ పరిస్థితులపై స్పందిచిన కొన్ని సంస్థలు, కంపెనీలు ఉచితంగా మాస్కులు, శానిటైజర్స్ పంపిణీ చేస్తూనే ఉన్నాయి.ఎంత మంది సాయం చేస్తున్న కొరత కొరతగానే ఉంది.

దాంతో అమెరికాలోని అయోవాకి చెందిన డెబ్ సెగ్గిన్స్ అనే మహిళ తన వంతు సాయం చేయాలని అనుకుంది.పేదలకి మాస్కులు తయారు చేసి ఇవ్వాలని అనుకున్న ఆమె ముందుగా 100 మాస్కులు చేసి ఒక చెట్టుకి వాటిని కట్టేసి పేదలు ఎవరైనా ఈ మాస్కులు తీసుకోవచ్చని బోర్డ్ పెట్టింది.


దాంతో ఎంతో మంది పేద ప్రజలు మాస్కులు తీసుకున్నారు.స్నేహితులు, సన్నిహితులు ఆమె సేవకి మెచ్చుకుని ఆమెకి సాయం చేయాలని భావించారు దాంతో ఆమె ఫైర్ సిబ్బందికి, వైద్య సిబ్బందికి పేద ప్రజలకి ఉచితంగా మాస్కులు చేయడం ప్రారంభించింది.కరోనా కట్టడి చేయడానికి తన వంతు సాయంగా ఈ ప్రయత్నం చేస్తున్నాని తెలిపింది.తనకి సాయం చేస్తున్న వారికి కృతజ్ఞలు తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube