స్కూల్ బోర్డు నుంచి చట్టసభల వరకు ఆధిపత్యం ఉండేలా: అమెరికాలో భారతీయ సమాజం పావులు

విద్య, ఉపాధి, వ్యాపారాల కోసం అమెరికాకు వెళ్లి స్థిరపడిన భారతీయులు అక్కడి రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు.అక్కడి ఎన్నికల్లో గెలుపొటములను ప్రభావితం చేసే స్థాయికి మనవాళ్లు చేరుకున్నారు.

 Indian-americans Want More Representation In 2020 Elections, America, Indians, T-TeluguStop.com

ప్రతీసారి హోరాహోరీగా సాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి కూడా భారతీయులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.అయితే అక్కడి స్కూల్ బోర్డుల నుంచి చట్టసభల వరకు ప్రతిచోటా మన ఆధిపత్యం వుండేలా అమెరికాలో భారతీయ సమాజం పావులు కదుపుతోంది.

దీనిలో భాగంగా ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఎక్కువ మంది భారతీయ రాజకీయ నాయకులు గెలిచేందుకు గాను దాదాపు 10 మిలియన్ డాలర్లను ఖర్చు పెట్టేందుకు సిద్ధమైంది.ఇది మన సమాజానికి, మనదేశానికి కీలకమైన క్షణమని గ్రూప్ ఇంపాక్ట్ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, భారతీయ వలసదారుల తరపున పోరాడుతున్న న్యాయవాది కుమారుడు నీల్ మఖిజా పేర్కొన్నారు.

భారతీయ సమాజానికి చెందిన అభ్యర్ధులను నియమించడం, శిక్షణ, మద్ధతు ఇవ్వడంపై దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు.

Telugu America, Bidden, Democaritic, Hillari Clinton, Indian, Indians, Kamala Ha

పరిశోధనా సంస్థ సీఆర్‌డబ్ల్యూ స్ట్రాటజీ ప్రకారం.భారతీయ అమెరికన్ ఓటర్లలో మూడొంతుల మంది మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్‌కు 2016లో మద్ధతు ఇచ్చారు.ఈ ఏడాది ఎన్నికల్లో డెమొక్రటిక్ ప్రెసిడెంట్ నామినీ జో బిడెన్‌కు కూడా భారత సంతతి ప్రజలు మద్ధతుగా నిలిచే అవకాశం వుందని సర్వేలు చెబుతున్నాయి.

మెక్సికన్ల తర్వాత భారతీయ- అమెరికన్లు యూఎస్‌లో రెండవ అతిపెద్ద వలస సమూహం.కానీ వారు కాంగ్రెస్ సభ్యులలో ఐదుగురు మాత్రమే ఉండటం దురదృష్టకరం.

Telugu America, Bidden, Democaritic, Hillari Clinton, Indian, Indians, Kamala Ha

మరోవైపు అమెరికన్ సమాజంలో భారతీయుల పలుకుబడి పెరుగుతుండటం వల్ల, డెమొక్రటిక్ కాంగ్రెస్ ప్రచార కమిటీ భారతీయ భాష అయిన హిందీలో ప్రకటనలు ఇస్తోంది.ఒకానొక దశలో భారతీయ అమెరికన్ సెనేటర్ కమలా హారిస్.బిడెన్‌కు ప్రధాన పోటీదారుగా నిలిచిన విషయం తెలిసిందే.అమెరికన్ రాజకీయ రంగంలో ఇండో అమెరికన్ సమాజ ప్రాబల్యం పెరుగుతుండటాన్ని తాను సంతోషిస్తున్నానని కమలా హారిస్ స్వాగతించారు.ఒక్క భారతీయ అమెరికన్లే కాకుండా అన్ని జాతులు అమెరికా ప్రజాస్వామ్యంలో కీలక స్థానాల్లో ఉన్నారని ఆమె చెప్పారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube