అమెరికాలోని భారతీయులకి గుడ్ న్యూస్...!!!

కరోనా వైరస్ అమెరికాలో అతిపెద్ద విలయం సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది.ఈ మహమ్మారిని తరిమేయడానికి అమెరికా విశ్వప్రయత్నాలు చేస్తోంది.

 America Immigration Good News Tourist Visa Extension,  America, Immigration, Tou-TeluguStop.com

ఈ క్రమంలోనే షట్ డౌన్ పాటించాలని చెప్పడంతో పాటుగా యూనివర్సిటీలు , కాలేజీలు, స్కూల్స్ , హాస్టల్స్ , పర్యాటక ప్రదేశాలు ఇలా ప్రతీ ఒక్క ప్రాంతాన్ని మూసేయించింది.విమానయాన సర్వీసులని కూడా రద్దు చేసింది.

ఈ క్రమంలో ఎంతో మంది పర్యాటకులు అమెరికాలోనే చిక్కుకుపోయారు…అదే సమయంలో భారత్ సైతం అంతర్జాతీయ విమాన సర్వీసులని రద్దు చేయడంతో అమెరికాలో భారత పర్యాటకులు చిక్కుకుపోయారు.అయితే
అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులకి అమెరికా ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయం భారతీయులకి మాత్రమే కాకుండా పర్యాటక వీసాలు తీసుకుని అమెరికా వచ్చిన వారికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.పర్యాటక వీసాపై తమ దేశం వచ్చిన వారిలలో గడువు పూర్తయిన వారు యునైటెడ్ స్టేట్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ కి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ప్రకటించారు.

Telugu America, Americatourist, Tourist Visa-

ఇలా దరఖాస్తులు చేసుకున్న వారి పత్రాలని పరిశీలించి వీసా గడువులు పొడిగిస్తామని ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రకటించారు.మరోవైపు హెచ్-1 బీ వీసా గడువు ముగిసిన వారు ఎంతో మంది ఉన్నారు.అమెరికా నిభంధనల ప్రకారం హెచ్-1 బీ వీసా గడువు పూర్తయితే వారు అమెరికాలో ఉన్నా అక్రమంగా ఉన్నట్టుగానే లెక్క గడుతారు.అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా హెచ్-1 బీ గడువు ముగిసినా వారికి కొంత కాలం పాటు ఇక్కడ ఉండే వెసులుబాటు కల్పిస్తామని అన్నారు…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube