భారతీయ విద్యార్ధులకు అమెరికా గుడ్ న్యూస్...!!!

కరోనా మహమ్మారి కారణంగా విదేశాలకు వెళ్ళే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది.ఈ క్రమంలోనే భారత్ నుంచీ ప్రతీ ఏటా ఉన్నత చదువుల కోసం పెద్ద ఎత్తున అమెరిక వెళ్ళే విద్యార్ధులు ఆగిపోవడంతో పాటు, అమెరికా కూడా విదేశీయులను తమ దేశంలోకి రాకుండా కరోనా ఆక్షంలు పెట్టడంతో విద్యార్ధులు అమెరికా వెళ్లేందుకు ఇష్టపడలేదు.

 America Good News For Indian Students , America, Indian Students, Visa, Visa Rej-TeluguStop.com

అయితే కొన్ని నెలల క్రితం నుంచీ అమెరికా విదేశీయులపై ఆంక్షలు ఎత్తేయడంతో ముఖ్యంగా విద్యార్ధి వీసాలపై ఆంక్షలు సడలించడంతో మళ్ళీ అమెరికా వెళ్ళే భారతీయ విద్యార్ధుల సంఖ్య పెరుగుతోంది.ఈ క్రమంలో.

భారతీయ విద్యార్ధులు మళ్ళీ అమెరికాలో విద్యకు ఆసక్తిని చూపిస్తూ దరఖాస్తులు చేసుకున్నారు.అయితే మొదటి సారిగా విద్యార్ధి వీసా కోసం దరఖాస్తు చేస్తున్న వారి వీసాలకు ప్రాధాన్యతను ఇచ్చిన వారికి వీసాలను జారీ చేసింది.

అయితే మొదటి సారి అప్లై చేసుకున్న వారి వీసాలు రిజక్ట్ అయితే వారు మళ్ళీ రెండవ సారి దరఖాస్తు చేసుకుంటే వారి వీసాలపై పరిమితులు విధించింది.దాంతో ఎంతో మంది విద్యార్ధులు ఆందోళన చెందారు.

ఈ పరిస్థితుల నేపధ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది…అదేంటంటే.

ఎఫ్ -1 అప్లికేషన్ రిజక్ట్ అయిన విద్యార్ధులు ఎవరైతే ఉన్నారో వారు మరొక్క సారి వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటించింది.

దాంతో కేవలం ఈ ఒక్క నెలలో భారతదేశ వ్యాప్తంగా 15 వేల విద్యార్ధి వీసా స్లాట్ల ను విడుదల చేసింది.విద్యార్ధి వీసా ఒకసారి రిజక్ట్ అయిన వారు అదే విద్యా ఏడాదిన రెండవ సారి కూడా ఈ స్లాట్ల లో దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది.

అయితే మొదటి సారి అప్లై చేసినపుడు ఇంటర్వ్యూ చేసిన అధికారి కాకుండా మరొక అధికారి రెండవ సారి వీసా అభ్యర్ధన సమయంలో ఇంటర్వ్యూ చేస్తారని తెలిపింది.అంతేకాదు ఈ స్లాట్ల లో అవకాశం లభించని విద్యార్ధులు ఎలాంటి నిరుశ్చాహం చెందాల్సిన అవసరం లేదని వారు అత్యవసర అప్పాయింట్మెంట్ అవకాశాన్ని వినియోగించుకునే వీలు ఉంటుందని అమెరికన్ ఎంబసీ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube