తల్లి పాలకు అమెరికా ఎంతగా ప్రాముఖ్యత ఇస్తుందో చూడండి.. ఇండియాలో కూడా ఇలా చేయాలి     2019-01-17   15:05:47  IST  Ramesh Palla

అప్పుడే పుట్టిన పిల్లలకు మరియు సంవత్సరం వయసు ఉన్న వారికి తల్లి పాలు ఎంతగా మంచిదో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ప్రతి పాపకు కూడా తల్లి పాలు పట్టాలని పెద్ద యెత్తున ప్రచారం చేస్తున్నారు. చిన్నప్పుడు తల్లి పాలు తాపడం వల్ల పెద్దయిన తర్వాత కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఒకప్పుడు తల్లి పాలు బాగానే ఇచ్చేవారు. కానీ మద్యలో కొన్నాళ్లు తల్లి పాలు ఇవ్వడం వల్ల ఆడవారి అందం దెబ్బతింటుందని డబ్బా పాలు ఇవ్వడం మొదలు పెట్టారు. అయితే ప్రభుత్వాలు మళ్ళీ తల్లి పాల ప్రాముఖ్యతను తెలియజేసేలా కార్యక్రమాలు చేపట్టారు.

America Gives Importance For Mother Milk-Mother Milk In Viral About American Production

America Gives Importance For Mother Milk

అమెరికాలో తల్లి పాల ప్రాముఖ్యత గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అమెరికాలో తల్లి పాలు పిల్లలకు అందటం లేదు. అందుకే పిల్లల శ్రేయసు కోసం తల్లి పాల ప్రయోజనాలను, ప్రాముక్యతను తెలియజేస్తూ కార్యక్రమాలు నిర్వహించడం తో పాటు, పలు రకాల యాడ్స్ ను తయారు చేస్తున్నారు. ఇక అమెరికాలోని తల్లులు బహిరంగ ప్రదేశాల్లో పాలు ఇవ్వడానికి ఇబ్బంది లేకుండా అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

America Gives Importance For Mother Milk-Mother Milk In Viral About American Production

విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్ లో తల్లులు పాలు ఇచ్చేందుకు ప్రత్యేకమైన రుములను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు సంబంధించి పై నుండి ఆర్డర్స్ కూడా వచ్చాయి. బయట ఉన్నంత మాత్రాన పిల్లలకు పాలు ఇవ్వడానికి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎక్కడైనా, ఎప్పుడైనా పిల్లలకు పాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేయడం అమెరికా చేసిన మంచి పనిగా చెబుతున్నారు. ఇండియాలో కూడా ఇలాంటి ఏర్పాట్లు చేయాలని తల్లులు కోరుతున్నారు. ఈ విషయం పై అందరికీ అవగాహన కలిగి ప్రభుత్వం దృష్టికి వెళ్లాలంటే తప్పకుండా ఈ విషయాన్ని షేర్ చేయండి.