ఫలిస్తున్న బిడెన్ వ్యూహం..అమెరికన్స్ గట్టెక్కినట్టేనా..??

అమెరికాలో కరోనా మహమ్మారి ఏ స్థాయిలో తన విశ్వరూపం చూపించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ప్రతీ రోజు లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదు అవ్వడంతో ఈ మహమ్మారి నుంచీ అమెరికన్స్ బయటపడమే కష్టం అనుకున్నారు అందరూ కానీ బిడెన్ అధ్యక్షుడిగా ఎంట్రీ ఇచ్చిన తరువాత సీన్ మొత్తం మారిపోయింది.

 America Getting Fewer Corona Cases-TeluguStop.com

అధ్యక్షుడిగా బిడెన్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తన ప్రధాన కర్తవ్యం అమెరికా నుంచీ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడమేనని, ఇందుకోసం తన యంత్రాంగం మొత్తం తీవ్రంగా శ్రమిస్తుందని ప్రకటించారు.


 America Getting Fewer Corona Cases-ఫలిస్తున్న బిడెన్ వ్యూహం..అమెరికన్స్ గట్టెక్కినట్టేనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అధికారంలోకి వచ్చీ రాగానే ట్రంప్ నియమించుకున్న టీమ్ కరోనా కట్టడికి వ్యూహాలను రచించింది.

ఫలితంగా దాదాపు ఐదు నెలల తరువాత మొట్ట మొదటి సారిగా అమెరికాలో కరోనా కేసుల సంఖ్యలో మార్పులను గమనించారు.అమెరికాలో మొట్ట మొదటి నుంచీ కరోనా కేసులపై పరిశోధనలు చేస్తున్న హాప్ కిన్స్ యూనివర్సిటీ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది.

థాంక్స్ గివింగ్ , క్రిస్మస్ సందర్భంగా అమాంతం పెరిగిపోయిన కేసులు బిడెన్ ప్రణాళికతో కట్టడయ్యాయని ప్రకటించింది.


కరోనాను కట్టడి చేసేందుకు బిడెన్ నిపుణులతో ఓ టీమ్ ను సిద్డం చేశారు.ఈ టీమ్ కరోనా మహమ్మారి నివారణ కోసం ప్రత్యేకమైన చర్యలు చేపట్టడంలో కీలక పాత్ర పోషించింది.ముఖ్యంగా బిడెన్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడం కలిసి రాగా.

అంతకంటే ముఖ్యంగా సామాజిక దూరం పాటించడం, మాస్క్ లు ధరించమని బిడెన్ చెప్పడం కరోనా కట్టడికి బాగా కలిసోచ్చాయని అంటున్నారు నిపుణులు. 100 రోజుల పాలనలో 100 మిలియన్ మందికి టీకా వేయడమే టార్గెట్ గా పెట్టుకున్న బిడెన్ కు తాజాగా లెక్కలు ఊరటనిస్తాయని అంటున్నారు.

గతంలో కేవలం ఒక్క రోజులో లక్షల సంఖ్యలో కేసులు నమోదు అయ్యేవని, కానీ ఇప్పుడు ఒక్క రోజులో కేవలం 40 వేల కేసులు నమోదు అవుతున్నాయని, మరణాల సంఖ్య కూడా తగ్గిందని హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది.

#Joe Biden Team #America #Corona Vaccine #JoeBiden #COVID Rules

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు