అమెరికా మాజీ సర్జన్ జనరల్ హెచ్చరిక : “మాస్క్” తప్పనిసరి చేయండి లేదంటే....

కరోనా మహమ్మారి మొదటి దెబ్బకు బిత్తర పోయిన అగ్ర రాజ్యం, సెకండ్ వేవ్ సమయానికి వ్యాక్సిన్ లతో కట్టడి చేసేసామని ఇకపై మాస్క్ లు అవసరం లేదంటూ మాస్క్ రహిత అమెరికాగా మొట్టమొదటి దేశంగా అమెరికాను నిర్మించామని జబ్బలు చరుచుకున్నారు అధ్యక్షుడు బిడెన్, ఆయన సలహాదారు ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీ.అంతేకాదు మాస్క్ లు లేకుండా తిరిగేయచ్చు అంటూ సలహాలు కూడా ఇచ్చారు.

 Us Surgeon General Jerome Adams Urges Wearing Mask Is Necessary, Us Surgeon Gene-TeluguStop.com

అయితే వారి అతివిశ్వాసం ఇప్పుడు అమెరికా వాసుల కొంప ముంచుతోంది.

భారత్ లో సెకండ్ వేవ్ సమయంలో కేసులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో ఆంటోని పౌచీ భారతీయులు మాస్క్ ధరించాలని సూచించారు.

కానీ అమెరికాలో డెల్టా కేసులు పెరుగుతాయని అంచనా వేయలేని ఫౌచీ మాత్రం అమెరికా ప్రజలకు మాస్క్ విషయంలో సూచనలు ఇవ్వలేకపోయారు.అధ్యక్షుడు బిడెన్ సైతం మాస్క్ ధరించాలనే నిభందనలు సడలించడంతో ఇప్పుడు ఆ తప్పిదం అమెరికా వాసుల ప్రణాల మీదకు తెస్తోంది.

అమెరికాలో రోజు రోజుకు డెల్టా వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి.గడిచిన వారం రోజుల్లో దాదాపు 70 శాతం కేసులు పెరిగాయని, కాలిఫోర్నియాలో డెల్టా వేరియంట్ విశ్వరూపం చూపిస్తోందని నిపుణులు అంటున్నారు…ఇదిలాఉంటే

Telugu Anthony Fauci, Calinia, Covid, Delta, Joe Biden, Surgeongeneral-Telugu NR

లాస్ఏంజిల్స్ లో మాస్క్ నిభందనను మరో సారి అక్కడి ప్రభుత్వం అమలు చేసింది.కాలిఫోర్నియా లో రోజు రోజుకు నమోదయ్యే కేసుల్లో దాదాపు 50 శాతం డెల్టా వేరియంట్ కేసులేనట.ఈ పరిస్థితి కాలిఫోర్నియాలో భవిష్యత్తు లో మరింత చేజారే అవకాశం ఉందని ప్రముఖ మాజీ ఆరోగ్య నిపుణుడు సర్జన్ జేరోమ్ ఆడమ్స్ ఆందోళన చెందుతున్నారు.

వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాస్క్ అవసరం లేదనే సిడీసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకున్న వారికిలో చాలామందికి డెల్టా వేరియంట్ సోకుతోందని ఆయన సూచించారు.మాస్క్ నిభందన పాటించక పొతే భవిష్యత్తులో అమెరికా మొదటి వేరియంట్ కంటే పెను విపత్తును చూడాల్సి వస్తుందని, మాస్క్ నిభందన అమెరికా వ్యాప్తంగా అమలయ్యేలా చూడాలని హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube