తొక్కి పడేస్తాం..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సారి రెచ్చిపోయారు.అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వేదికపై మాట్లాడిన ట్రంప్ ఎంతో ఉద్వేగ పూరితమైన ప్రసంగం చేశారు.

 America President Donald Trump Angry On Protesters, America, Donald Trump, Prote-TeluguStop.com

వైట్ హౌస్ లాన్ లో ఏర్పాటు చేసిన భారీ సభలో ట్రంప్ అమెరికా ఖ్యాతి గురించి, అమెరికా ప్రపంచానికి ఎంత ఆదర్శంగా నిలుస్తోంది అనే విషయాలని వెల్లడిస్తూనే రాజకీయంగా తనపై కక్ష సాధించాలనుకునే వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.

అమెరికాలో గడిచిన కొన్ని రోజులుగా నిరసనలు తెలిపుతూ అలజడి సృష్టిస్తున్న నిరసన కారులపై ట్రంప్ కోపంతో ఊగిపోతూ మాట్లాడారు.

అమెరికాలో అరాచక వాదులు, దోపిడీ దారుల ఆగడాలని సహించబోనని, అలాంటి వేషాలు వేసేవారిని ఉక్కు పాదంతో అణిచివేస్థానాని ప్రకటించారు.మన దేశంలో విగ్రహాలు కూల్చేస్తూ చారిత్రాత్మక సంపదని నాశనం చేస్తూ అసలు అమెరికాకి జీవం పోసిన మహనీయులకి అవమానాలు కలిగించే దోపిడీ దారులని ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించనని అన్నారు.

Telugu America, Donald Trump, Donaldtrump, Protesters-

అమెరికా చరిత్రని తుడిచి పెట్టడానికే ఎంతో మంది యోధులకి అవమానం కలిగించడానికే నిరసన కారులు పూనుకున్నారని, ఈ పరిస్థితులని కలిగిస్తోంది వామపక్షాలు దారుణమైన ఆలోచనేనని మండిపడ్డారు.అమెరికా చరిత్రని భావి తరాలకి తెలియకుండా చేయడానికే వెళ్ళు కంకణం కట్టుకున్నారని వీరిపై కటినమైన చర్యలు తీసుకోకపోతే మరింత దూకుడు ప్రదర్శిస్తారని ట్రంప్ ప్రకటించారు.ఇదిలాఉంటే ఈ మధ్య కాలంలో ట్రంప్ ఇలా భావోద్వేగ పూరితమైన ప్రసంగం చేయలేదని, నిరసన కారులపట్ల ట్రంప్ పూర్తి అసహనంతో ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube