ట్రంప్,పెలోసీ ల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం  

America Donald Trump Peolsi - Telugu America, Donald Trump, Hydroxychloroquine, Peolsi, Trump And Pelosi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, అధ్యక్షుడి తరువాత స్థానంలో స్పీకర్ స్థానంలో ఉన్న‌ నాన్సీ పెలోసీ ల మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది.తాజాగా పెలోసీ ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ట్రంప్‌… కుక్క మలమూత్రాలు పూసుకు తిరిగే పిల్లాడి లాంటి వారు అంటూ పెలోసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటీవల ట్రంప్‌ ఎంఎస్‌ఎన్‌బిసి టెలివిజన్‌ హోస్ట్‌ జియో స్కార్‌బరో గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

 America Donald Trump Peolsi

కొద్ది రోజుల క్రితం ట్రంప్‌ ఎమ్‌ఎస్‌ఎన్‌బీసీ టెలివిజన్‌ హోస్ట్‌ జియో స్కార్‌బరో గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.అతడిని సైకో అంటూ ట్రంప్‌ తీవ్ర విమర్శలు చేశారు.

దీని గురించి మీడియా ప్రతినిధిలు పెలోసిని ప్రశ్నించగా.‘అధ్యక్షుడు.

ట్రంప్,పెలోసీ ల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం-Telugu NRI-Telugu Tollywood Photo Image

షూస్‌కు కుక్క విసర్జన పూసుకుని తిరిగే పిల్లాడిలాంటి వారు అంటూ మండిపడ్డారు.తనతో పాటు పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ దీన్ని పూస్తాడని అన్నారు.

కుక్క విసర్జనను ఒకసారి పూసుకుంటే అది చాలా కాలం పాటు అలానే ఉంటుంది’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు పెలోసి.అధ్యక్షుని తర్వాత హోదాలో ఉపాధ్యక్షుని తర్వాతి స్థానంలో ఉన్న నాన్సీ పెలోసి డెమొక్రాటిక్ పార్టీకి చెందినవారు అన్న విషయం తెలిసిందే.అయితే పెలోసీ, అధ్యక్షుడు ట్రంప్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.గత ఏడు నెలలుగా ఇద్దరూ కనీసం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు.కానీ మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది.వైద్యశాస్త్రపరంగా రుజువుకాని హైడ్రాక్సీక్లోరోక్విన్ వేసుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించిన తర్వాత పెలోసి ఆయన ఊబకాయాన్ని ఎత్తిచూపారు.

తానైతే అధ్యక్షునికి అలాంటి మందులు సూచించనని అన్నారు.దీనిపై ట్రంప్ తనదైన శైలిలో వ్యక్తిగత విమర్శలకు దిగారు.

‘పెలోసి ఒక రోగిష్టి మహిళ అని. ఆమెకు చాలా సమస్యలు ఉన్నాయి అని, పలు మానసిక సమస్యలతో ఆమె బాధపడుతున్నారు’ అంటూ విమర్శలు చేయడం తో ఇద్దరి మధ్య మాటల యుద్ధం షురూ అయ్యింది.దీనితో పెలోసీ పై విధంగా ట్రంప్ పై విమర్శలకు దిగారు.మరి పెలోసీ విమర్శలపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు