భారతీయులపై సవతి ప్రేమ..ట్రంపూ ఇది న్యాయమేనా..??  

Democratic Party Chief Bidden Support To Talk Indian NRI\'s About America President Elections, America, Donald Trump, Joe Bidden, Indian NRI\'s, America President Elections, Indian Vote Banking - Telugu America, America President Elections, Donald Trump, Indian Nri\\'s, Indian Vote Banking, Joe Bidden

అమెరికాలో నవంబర్ 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి.ఈ నేపధ్యంలో ప్రపంచం మొత్తం అమెరికా వైపే కళ్ళప్పగించి చూస్తోంది.

 America Donald Trump Joe Bidden Indian Nris America President Elections Indian Vote Banking

గెలిచేది ట్రంపా లేక బిడెన్ నా అంటూ ఇప్పటికే లెక్కలు వేస్తున్నారు.ఎవరి బలాలు వారివి.

ఎవరి వ్యూహాలు వారివి.ఎవరి లెక్కలు వారివి.

భారతీయులపై సవతి ప్రేమ..ట్రంపూ ఇది న్యాయమేనా..-Telugu NRI-Telugu Tollywood Photo Image

అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీ కంటే కూడా ప్రతిపక్షంలో ఉన్న డెమోక్రటిక్ పార్టీకే విమర్సల బాణాలు ఎక్కుపెట్టే అవకాశాలు ఉన్నాయి.అడుగడుగునా ట్రంప్ చేసిన తప్పులని ఎత్తి చూపుతూ ముందుకు వెళ్తే విజయం మనదేనని డెమోక్రటిక్ పార్టీ నేతలు ఫిక్స్ అయ్యారు.

ఈ క్రమంలోనే

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన భారతీయుల ఓట్లకోసం వేట మొదలయ్యింది.భారతీయులపై ట్రంప్ చూపిస్తున్న సవతి తల్లి ప్రేమని హైలెట్ చేస్తూ బిడెన్ వర్గం జోరుగా ప్రచారం మొదలు పెట్టింది.

భారతీయ ఎన్నారైల ఒక్క ఓటు కూడా ట్రంప్ కి వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యిపోయిన ప్రతిపక్ష నేతలు అందుకు తగ్గట్టుగా భారతీయుల ఓట్లని తమవైపుకి మళ్ళించుకునే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు.ట్రంప్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారతీయుల వీసాలపై ఆంక్షలు విధించారని ఇప్పుడు ఓట్ల కోసం భారతీయులు తనకి ఎంతో అండగా ఉంటారని చెప్పుకుంటున్నారని ట్రంప్ భారతీయులపై సవతి తల్లి ప్రేమని చూపిస్తున్నారని మండిపడుతున్నారు బిడెన్.

ట్రంప్ తాజా వ్యూహంపై అంచనాలు వేసిన బిడెన్ అందుకు తగ్గట్టుగా ఎదురు దాడి మొదలు పెట్టారు.గడించిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ భారతీయుల ఓట్లని తనకి అనుకూలంగా మలచుకునేందుకు ఆబ్ కి బార్ ట్రంప్ సర్కార్ అనే నినాదంతో భారతీయులకి దగ్గర అయ్యారు ఎన్నికల్లో విజయం సాధించారు.ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి బిడెన్ కూడా ఇదే బాటలో పయనించనున్నారు. “అమెరికా నేత కైసా హో జో బిడెన్ జైసా హో” అనే నినాదాలతో సుమారు 14 బాషలలో ప్రచారం చేస్తూ భారతీయ ఓట్ల కోసం వెంపర్లాడుతున్నారు.

భారతీయులపై సవతి తల్లి ప్రేమ అంటున్న బిడెన్ కాశ్మీర్ అంశంపై తల దూర్చడం వలన ఎలాంటి ప్రేమని భారతీయలపై చూపిస్తున్నారో తెలుసుకోవాల్సి ఉంది.

#Donald Trump #Joe Bidden #Indian NRI'S #America

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

America Donald Trump Joe Bidden Indian Nris America President Elections Indian Vote Banking Related Telugu News,Photos/Pics,Images..