అయ్యో పెద్దన్న ? అమెరికాకు ఈ దుస్థితి రావడానికి కారణం ఆయనేనా ?  

America Donald Trump Covid 19 Corona Virus Chaina Wuhan - Telugu America President, America Role Model For Other Countries, Chaines Comes In America, Corona Vacine Test Kits, Corona Virus, Covid-19, Donald Trump

ప్రపంచ దేశాలు పెద్దన్నగా పేరు ప్రఖ్యాతులు పొందిన అమెరికా ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా అతలాకుతలం అవుతోంది.ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో కరోనా వైరస్ బారిన పడి జనాలు విలవిల్లాడుతూ ఉండగా, అందులో ఎక్కువ గా విలవిల్లాడుతున్న దేశం అమెరికా.

 America Donald Trump Covid 19 Corona Virus Chaina Wuhan

అక్కడ ఓ నాలుగు రాష్ట్రాలు తప్ప అన్ని చోట్ల ఇది తీవ్రరూపం దాల్చింది.అసలు ఇక్కడ ఈ వైరస్ ఇంత వేగంగా విస్తరించడానికి ప్రధాన కారణం ఆ దేశ అధ్యక్షుడు అనుసరించిన వైఖరే కారణమని ఇప్పుడు అక్కడి ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అసలు కరోనా వైరస్ బారి నుంచి ప్రజలను బయటపడేసే విధంగా ట్రంప్ ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు.త్వరలో అమెరికాలో జరగబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ట్రంప్ లాక్ డౌన్ ప్రకటించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అయ్యో పెద్దన్న అమెరికాకు ఈ దుస్థితి రావడానికి కారణం ఆయనేనా -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అసలు అమెరికా అంటే ప్రపంచ దేశాలన్నీ ఆ దేశాన్ని ఒక రోల్ మోడల్ గా తీసుకుంటాయి.అటువంటి అమెరికా ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా విలవిల్లాడుతోంది.లక్షలాది మందికి ఈ కరోనా వైరస్ సోకడంతో పాటు 1700 మంది వరకు మరణించారు.అయినా ఇప్పుడు అమెరికా దగ్గర ఈ వ్యాధి నిర్ధారణ చేసి టెస్టింగ్ కిట్లు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు.

అసలు అమెరికాలో తొలి కరోనా వైరస్ కేసు జనవరి 21వ తేదీన నమోదయింది.చైనా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి ఉన్నట్టుగా నిర్ధారణ అయినా ట్రంప్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

అంతేకాకుండా చైనా నుంచి అమెరికాకు వచ్చిన అమెరికన్లకు కూడా ఎటువంటి టెస్ట్లు చేయకుండానే వారిని దేశంలోకి అనుమతించారు.అక్కడితో ఆగకుండా వ్యూహన్ వైరస్ అంటూ చైనాను ట్రంప్ ఎగతాళి చేశారు.

ట్రంపు కు వ్యాపార రంగంలో విశేష అనుభవం ఉండడంతో అమెరికాలో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉండేందుకు లాక్ డౌన్ ను ప్రకటించేందుకు వెనకడుగు వేసి , ప్రజలకు సరైన అవగాహన ట్రంప్ కల్పించలేకపోయాడు.ఆయన చేసిన తప్పిదం కారణంగా ఇప్పుడు యావత్ అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు అన్నట్టుగా పరిస్థితి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Related Telugu News,Photos/Pics,Images..