అమెరికాలో భారీ వైద్య కుంభకోణం..!!!  

American Doctor In Florida Sent To Prison For Fraud-

అమెరికన్ల కి ప్రభుత్వం అందించే వైద్య సదుపాయాలని ఓ వైద్యుడు దుర్వినియోగం చేశాడు.అమెరికా ప్రభుత్వాన్ని మోసం చేసిన అతడు అడ్డదారిలో భారీ మొత్తంలో కాజేసి , చివరికి జైలుపాలయ్యాడు.వివరాలలోకి వెళ్తే..

American Doctor In Florida Sent To Prison For Fraud--American Doctor In Florida Sent To Prison For Fraud-

అమెరికా ప్రభుత్వం తమ పౌరుల కోసం మెడికేర్, మెడిక్ ఎయిడ్ , అనే రెండు పధకాలని అందిస్తుంది.ఈ పధకాల ద్వారా అనారోగ్య సమస్యలు ఉన్న వారు చికిత్స చేయించుకోవచ్చు అయితే

ఆ పదకాలని తనకి అనుకూలంగా మలుచుకున్న ఫిలిప్ ఎస్ఫార్మర్ అనే ఓ డాక్టరు.ప్రభుత్వం నుంచి 1.3 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.9 వేల కోట్ల పైగానే కాజేశాడు.తన వద్ద ఉన్న పేషెంట్ల చికిత్సకి ఫీజు కట్టాలని ప్రభుత్వానికి ఆర్జీలు పెట్టుకునే ఆ డాక్టర్, రోగులని పరిశీలించడానికి అధికార్లు వచ్చే సమయానికి పక్క ఆసుపత్రి నుంచీ రోగులని తీసుకువచ్చే వాడు.అయితే అధికారులు వచ్చే విషయాన్ని తెలుసుకోవడానికి ఆ అధికారులలో ఒకరికి లంచం ఇచ్చేవాడు.

అయితే ఈ విషయం ఒక్క సారిగా బయటపడటంతో ఫిలిప్ ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కుంభకోణాన్ని అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వైద్య రంగ కుంభకోణంగా పేర్కొన్న కోర్టు అతడికి సహకరించిన అధికారిని కూడా ఆరేస్ చేయాలని తీర్పు ఇచ్చింది.