అమెరికాలో కోవిడ్ డాలర్..మీరు మాములోళ్ళు కాదురా బాబు..!!

బుర్ర ఉండాలేకానీ ప్రజా సంక్షేమం చేపట్టడంలో ఎన్నో దారులు ఉంటాయని, ఓ మంచి ఆలోచన ప్రజలకి ఉన్న ఆర్ధిక అవసరాల బాధల నుంచీ బయట పడేస్తుందని నిరూపించారు అమెరికాలోని టేనోనీ ప్రభుత్వ యంత్రాంగం.కరోనా దెబ్బకి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అల్లాడి పోయారు.

 In America Tenoni City Mayor Make A Covid Dollar, America, Covid Dollar, Currenc-TeluguStop.com

ఉద్యోగాలు లేక కూలికి వెళ్ళే అవకాశాలు లేక చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో ఆకలితో పస్తులు ఉన్న వారు ఎందరో ఉన్నారు.ఇలాంటి విపత్కర పరిస్థితులు ప్రపంచంలో అన్ని చోట్లా ఉన్నవే…అయితే

అమెరికాలోని వాషింగ్టన్ లో ఉన్న టేనోనీ అనే చిన్న పట్టణంలో కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది.

డబ్బులు లేక, వస్తువులు కొనడానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.దాంతో డబ్బుల చెలామణీ ఆగిపోయింది, నిత్యావసర వస్తువులు అలాగే ఉండిపోయాయి.

ఈ క్రమంలో ఆ నగర మేయర్ కి ఓ ఆలోచన రావడంతో ఆచరణలో కి పెట్టి అద్భుతమైన ఫలితాలు పొందారు.అదేంటంటే.

Telugu America, America Ton, Covid Dollar, Ven-

తమకి తాముగా సొంతగా కరెన్సీ ముద్రించుకున్నారు.ఆ నగర మేయర్ వేన్ ఫోర్నీర్ ఆదేశాల మేరకు నగరంలోని ఓ మ్యూజియం లో ఉన్న కరెన్సీ ముద్రించే యంత్రం ని ఉపయోగంచి కొయ్యతో చేసిన చిన్న చిన్న చతురస్త్రాకర ముక్కలపై కోవిడ్ డాలర్ అనే పేరుని ముద్రించి అమలులోకి తెచ్చారు.ఇలా సుమారు 10 వేల డాలర్ల విలువైన డబ్బుని ముద్రించారు.అయితే ఈ కోవిడ్ డాలర్లు కేవలం ఆ పట్టణానికి మాత్రమే చెల్లుతాయి, మిగిలిన ప్రాంతాలలో ఇవి చెల్లవని ఆదేశించారు.

వీటిని స్థానిక ప్రజలకి పంచుతూ వారు నిత్యావసర వస్తువులు ఇతరాత్రా కొనుగోలుకు ఈ డాలర్లు ఉపయోగించమని ప్రకటించారు.గతంలో అంటే 1930 లో విపత్తు ఎదురయ్యి ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇదే పద్దతిని పాటించారని ఆ సమయంలో ఈ పద్దతి ప్రజల ఆర్ధిక కష్టాలు తీర్చిందని తెలిపారు అధికారులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube