అమెరికాకు బ్యాడ్ న్యూస్ చెప్పిన “ఐహెచ్ఎంఈ”

అమెరికాలో కరోనా ప్రభావం రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది.ఈ మహమ్మారిని నిలువరించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పాలి.

 Ihme Announces Corona Cases Increasing In America, Ihme, Covid Cases, April, Cor-TeluguStop.com

అమెరికన్స్ లో కరోనా నివారణపై అవగాహన కల్పించక పోవడం తో పాటు ట్రంప్ మాస్క్ లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా వ్యవహరించడంతో ఈ మహమ్మారి ప్రభావం తీవ్ర రూపం దాల్చింది.అయితే కరోనా తగ్గుముఖం పడుతోందని అనుకుంటున్న తరుణంలో

అధ్యక్ష ఎన్నికల ప్రభావం

కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదు అవ్వడానికి తోడయ్యింది.

బహిరంగ సమావేశాలు, భారీ సభల కారణంగా కరోనా కేసులు పెరుగుతాయని, ఏ ఒక్కరూ కూడా మాస్క్ ధరించడంలేదని అంటువ్యాధుల నిపుణులు పౌచీ ముందు నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.


ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు చూస్తుంటే కరోనాని నియంత్రిచక పొతే భవిష్యత్తులో అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అంటున్నారు నిపుణులు.

రోజు రోజుకు కరోనా మృతుల కేసులతో పాటు, కరోనా బాధిత కేసులు పెరిగిపోతున్న తరుణంలో వాషింగ్టన్ యూనివర్సిటీ ఫర్ హెల్త్ మేట్రిక్స్ అండ్ ఎవల్యుషన్ (ఐహెచ్ఎంఈ) బ్యాడ్ న్యూస్ తెలిపింది.ప్రస్తుతం అమెరికాలో 2.80 లక్షల మంది మృతి చెందారని అయితే ఏప్రియల్ నాటికి మృతుల సంఖ్య 5 లక్షలు దాటుతుందని సంచలన నివేదిక ఇచ్చింది.

Telugu April, Corona, Corona Wave, Covid, Ihme, Ihmecorona-Telugu NRI

ఒక వేల వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా దాని ప్రభావం మరణాలపై చూపలేదని కేవలం వ్యాక్సిన్ పై ఆశలు పెట్టుకోవద్దని కూడా తేల్చి చెప్పింది.అయితే వ్యాక్సిన్ ప్రభావం కేవలం 9 వేల మంది మృతి చెందకుండా కాపడగలదని, ప్రజలు ప్రతీ ఒక్కరూ మాస్క్ పెట్టుకుని సామాజిక దూరం పాటించడం కారణంగానే ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులను నియంత్రించవచ్చని పేర్కొంది.ఇదిలాఉంటే ఇప్పటి వరకూ కరోనా కారణంగా అమెరికాలో కేసుల సంఖ్య 1.51 కోట్లకు చేరుకోగా మృతి చెందిన వారి సంఖ్య 2.80 లక్షలు దాటింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube