భారతీయ చిన్నారి కోసం ఎల్లలు దాటి వచ్చిన అమెరికా జంట...!!

ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఇల్లు ఎంత కళకళ లాడుతూఉంటుంది, ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది.భారతీయ సనాతన సంస్కృతీ సాంప్రదాయాలలో ఆడవారికి భారత దేశం ఇచ్చే గౌరవం అంతా యింతా కాదు.

 America Couple Adopt Gujarath Baby Girl , America, Gujarat, Gandhi Nagar, Child-TeluguStop.com

అలాంటి భారతావనిలో ఆడపిల్లలను కనడం పాపంగా భావిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.కొందరు తల్లి తండ్రులు ఆడపిల్లలు పుడితే చెత్త కుప్పలో పడేస్తున్నారు, లేదంటే చంపి పాతి పెట్టేస్తున్నారు.

అయితే పిల్లలు లేని, ఒక బిడ్డ పుట్టగానే మరొక బిడ్డ కోసం అనాధ పిల్లలను దత్తత తీసుకోవాలి అనుకుని ఎంతో మంది ఇలా అనాధలుగా మారిన వారిని అక్కున చేర్చుకుంటున్నారు.ఆడపిల్లగా పుట్టడమే పాపమై చెత్త కుప్పలో పడవేయబడిన ఓ చిన్నారిని అమెరికాకు చెందిన జంట దత్తత తీసుకోవాలని ఎల్లలు దాటి భారత్ వచ్చింది.

అక్కున చేర్చుకుంది.వివరాలోకి వెళ్తే.

గుజరాత్ లోని గాంధీ నగర్ లో సమీపంలో ఓ చెత్త కుప్పలో గాయాలతో ఉన్న చిన్నారిని గుర్తించిన స్థానికులు పాపను అహ్మదాబాద్ లోని చిల్డ్రన్ హోమ్ కు తరలించారు.పసి గుడ్డుగా వచ్చిన పిల్లకు అర్పిత అని పేరు పెట్టిన హోమ్ ఎంతో జాగ్రత్తగా పెంచింది.ప్రస్తుతం ఆ పసి గుడ్డు వయసు 4 ఏళ్ళు.ఈ క్రమంలోనే చిల్డ్రన్ హోమ్ వాళ్ళు అర్పిత పేరును ఆన్లైన్ లో దత్తతకు ఉంచారు.

దాంతో ఆన్లైన్ లో దత్తత వివరాలు తెలుసుకున్న అమెరికా జంట అర్పితను దత్తతు తీసుకోవడానికి ముందుకు వచ్చారు.దత్తతు తీసుకోవడానికి ముందే ఆమె పేరును జాయ్ గా మార్పు చేశారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ అర్పిత ఉన్న చైల్డ్ హోమ్ కు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.దత్తత కు ముందుకు వచ్చిన అమెరికా జంటను ప్రశంసించారు.

దత్తత ప్రక్రియ వేగంగా పూర్తి చేయమని అందుకు తగ్గ సహాయ సహకారాలు అధికారులు అందిస్తారని హోమ్ కు తెలిపారు.అర్పితను అమెరికా జంటతో పంపమని ఆదేశించారు.విధి అంటే ఇదే భారతీయ జంట తాము కన్న భంధాన్ని వద్దనుకుని చెత్త కుప్పలో వేస్తే అమెరికా జంట ఆ పిల్ల మాకు కావాలంటూ ముందుకు వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube