కరోనాలో కూడా “అగ్ర రాజ్యం” అనిపించుకుందిగా...!!!  

America Corona Positive Cases China - Telugu America, China, Coronavirus, High, Positive Cases

అగ్ర రాజ్యం అంటే అగ్ర రాజ్యమే ఎక్కడా రాజీ పడే అవకాశమే లేదు.ఎందులోనైనా ముందు ఉండాల్సిందే.

 America Corona Positive Cases China

అందుకే ప్రపంచాన్ని సుస్సు పోయిస్తున్న కరోనా పాజిటివ్ కేసులలో కూడా తమదే పై చేయి చేసుకుంది.మొత్తానికి అగ్ర రాజ్యం అనిపించుకుంది.అవును మీరు విన్నది నిజమే కరోనా పాజిటివ్ కేసులలో ఇప్పటి వరకూ చైనాని డీ కొట్టిన దేశమే లేదని అనుకుంటున్న క్రమంలో అమెరికా నేను ఉన్నాను అంటూ చెయ్యి పైకి లేపి మరీ కరోనాకి ఎదురు వెళ్ళింది…

అమెరికా ఏమరుపాటుకి, అధ్యక్షుడి టెంపరి తనానికి ఇప్పటికి అమెరికా వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది.1300 మంది మృతి చెందగా వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.న్యూజిల్యాండ్, న్యూయార్క్ వంటి అతిపెద్ద నగరాలలో అంధకారం నెలకొంది.కరోనా ధాటికి ప్రజలు పిట్టలు రాలినట్టుగా రాలిపోతున్నారు.ఇప్పటి వరకూ చైనానే కరోనా పాజిటివ్ కేసులలో టాప్ అనుకుంటే అందరిని తోక్కేసుకుంటూ అమెరికా ఇప్పుడు అత్యధికంగా

కరోనాలో కూడా “అగ్ర రాజ్యం” అనిపించుకుందిగా…-Telugu NRI-Telugu Tollywood Photo Image

81,943 కరోనా పాజిటివ్ కేసులతో ప్రపంచంలోనే అత్యధికంగా ముందు వరుసలో ఉంది.చైనాలో ఈ సంఖ్య 81,285 గా నమోదు అయ్యింది.అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే మరణాల సంఖ్యలో మాత్రం చైనానే అమెరికా కంటే ముందు వరసలో ఉంది.ఇక ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు అత్యధికంగా ఇటలీ, స్పెయిన్, జర్మనీ, ఇరాన్, ఫ్రాన్స్ లలో నమోదు అయ్యాయి…

.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

America Corona Positive Cases China Related Telugu News,Photos/Pics,Images..