ఆల్ టైం రికార్డ్...అమెరికా కొంప ముంచేస్తోన్న కరోనా...24 గంటల్లో ..!!  

అమెరికాలో కరోనా మహమ్మారి రోజు రోజుకి ఊహించని రీతిలో విరుచుకుపడుతోంది.తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అగ్ర రాజ్యాన్ని వదిలిపెట్టడం లేదు.

TeluguStop.com - America Corona Cases Joe Biden Thanks Giving Day

ఫలితంగా మృతుల సంఖ్య పెరగడమే కాకుండా, కరోనా బారిన పడిన వారి సంఖ్య కూడా రెట్టింపు అవుతోంది.గడించిన ఆరు నెలల కాలంలో ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య లక్షల్లో ఉండగా , బాధితుల సంఖ్య కోట్లకు చేరుకుంది.

కరోనాపై స్పష్టమైన అవగాహన ప్రజలకు ఉన్నా కొందరి బాధ్యతా రాహిత్యానికి అమెరికన్స్ చాలామంది బలై పోతున్నారు. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ చేపట్టిన సర్వే ప్రకారం.

TeluguStop.com - ఆల్ టైం రికార్డ్…అమెరికా కొంప ముంచేస్తోన్న కరోనా…24 గంటల్లో ..-General-Telugu-Telugu Tollywood Photo Image

అమెరికాలోకి కరోనా ఎంట్రీ ఇచ్చి సుమారు 6 నెలలు కావస్తోందని, కానీ ఈ కాలంలో ఒక్క సారి కూడా కరోనా మృతుల సంఖ్య 2400 మార్క్ దాటలేదని కానీ గడించిన 24 గంటలలో మృతుల సంఖ్య 2400 కు చేరుకోవడం రికార్డ్ స్థాయిలో మరణాలు నమోదు అయినట్టేనని తెలిపారు.అంతేకాదు ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన బాధితుల సంఖ్య 1లక్ష నుంచి 1.50 లోపు ఉండేది కానీ మొట్టమొదటి సారిగా కరోనా కేసుల సంఖ్య ఆల్ టైం రికార్డ్ గా 2 లక్షలకు చేరుకుందని తెలిపింది.పరిస్థితి ఇలానే కొనసాగితే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.ఇదిలాఉంటే


అమెరికాలో థాంక్స్ గివింగ్ డే ను పురస్కరించుకుని అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ అమెరికన్స్ ను ఉద్దేశించి మాట్లాడారు.వేడుకలలో పాల్గొనే ముందు తప్పకుండా అందరూ క్రమంగా మాస్కులు ధరించాలని, ప్రస్తుతం అమెరికాలో కరోనా విజృంభిస్తుందని, కరోనాకు నియంత్రించేందుకు ముందుగా మీ సాయం కావాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు.వ్యాక్సిన్ సాధ్యమైనంత త్వరలోనే అందుబాటులోకి వస్తుందని, అందుకు ప్రణాళికలు కూడా సిద్దం చేసి ఉంచాని ఆలోగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.అందరూ మంచి జీవితాన్ని గడుపుతారని అందుకు కొంత సమయమే పడుతుందని అమెరికన్స్ కు ధైర్యం చెప్పారు.

.

#America #24 Hours #AmericaCorona #Corona Cases #Joe Biden

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు