అమెరికాలో కరోనా...ఒక్క రోజులోనే విశ్వరూపం..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.కరోనా చేస్తున్న కరాళ నృత్యానికి అన్ని దేశాలు భయం గుప్పెట్లో బ్రతుకుతున్నాయి.

 America, New York, Corona Cases, Increased, Social Distance-TeluguStop.com

ముఖ్యంగా అగ్ర రాజ్యం అమెరికా కరోనా ధాటికి విలవిలలాడుతోంది.బ్రతికి బట్టకడితే చాలు అన్నట్టుగా ప్రజలు ఇళ్లకే పరిమితమై ఉంటున్నారు.

కానీ కరోనా అమెరికాపై పగబట్టిందా అన్నట్టుగా రోజు రోజుకి కేసుల సంఖ్య మృతుల సంఖ్య పెరిగిపోతోంది.కేవలం 24 గంటలు గడిచేలోగా అమెరికాలో లెక్కలు అంచనాలకి మించిపోతున్నాయి…

అమెరికాలో నిన్న ఒక్కరోజులో కరోనా బాధితుల సంఖ్య అమాంతం 26 వేలు గా నమోదయ్యింది .మృతుల సంఖ్య 2300 కి చేరుకుంది.దాంతో పరిస్థితులు అన్నీ చిన్నాభిన్నం అవుతున్నాయి.

కరోనా అదుపులోకి వచ్చిందని ట్రంప్ చెప్తున్న లెక్కలు అన్ని తప్పుడు లెక్కలని తేలిపోయింది.ఒక్క న్యూయార్క్ నగరంలోనే అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడంతో మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకి ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు.ఇదిలాఉంటే

Telugu America, Corona, York, Distance-

అమెరికాలో సోషల్ డిస్టెన్స్ పాటించడంలో ప్రజలు అలసత్వం వహిస్తున్నారు.గతంలో అంటే కూడా ప్రజలు అవగాహనకి వచ్చినా స్థానిక ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అమెరికా ప్రజల రక్షణ కోసం మరిన్ని కటినమైన చర్యలుకు కూడా వెనుకాడకూడదని అంటున్నారు నిపుణులు.అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో కరోనా కంట్రోల్ లోకి వచ్చినా ఆర్ధిక రాజధాని న్యూయార్క్ లో మాత్రం పరిస్థితి అదుపులోకి రావడంలేదని అంటున్నారు వైద్య నిపుణులు…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube