అమెరికా “సిడిసి” షాకింగ్ స్టేట్మెంట్...ఆందోళనలో అమెరికన్స్...!!!

అమెరికా కరోనా మహమ్మారి నుంచీ మెల్ల మెల్లగా కోలుకుంటున్న క్రమంలో అమాంతం వచ్చి పడింది మంకీపాక్స్.కరోనా దెబ్బకే అమెరికా ప్రజలు అల్లాడిపోయి భయాందోళనలకు లోనయ్యి దినదిన గండంలా గడపని రోజు లేదు.

 America Cdc Shocking Statements On Monkeypox,cdc,monkeypox,america,covid,cdc Dir-TeluguStop.com

ఈ క్రమంలో ఎంతో మంది అమెరికన్స్ తమ కుటుంబ సభ్యులు పోగొట్టుకున్నారు కూడా.అయితే ఈ పరిస్థితిని నుంచీ బయటపడుతున్న సమయంలో మంకీపాక్స్ రూపంలో మరో విపత్తు అమెరికా ప్రజలను మరో ఆందోళనలోకి నెట్టేసింది.

ఎంతో మంది అమెరికన్స్ ఈ వ్యాధి భారిన పడి నరకం అనుభవించారు కూడా.త్వరలో ఈ మహమ్మారి నుంచీ కోలుకుంటామని భావిస్తున్న తరుణంలో


అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది.

అమెరికా వ్యాప్తంగా ప్రస్తుతం వ్యాధి తగ్గుముఖం పడుతున్నా మంకీపాక్స్ ను పూర్తిగా నిషేధించడం సాధ్యం అయ్యే పనికాదని పెద్ద బాంబు పేల్చింది.మంకీపాక్స్ పై సిడిసి చేసిన రిపోర్ట్ లో ఈ అంశాలను పేర్కొంది.

సిడిసి లోని వ్యాధులకు సంభందించిన డైరెక్టర్ మార్క్ మాట్లాడుతూ మంకీపాక్స్ తో అమెరికన్స్ సహజీవనం చేయాల్సి వస్తుందని, తగ్గుముఖం పట్టిందని కదా అని అప్రమత్తంగా ఉండటం మంచిది కాదని ఆయన హెచ్చరించారు.

ప్రస్తుతం ఈ వ్యాధి తగ్గినట్టుగా ఉన్నా భవిష్యత్తు తరాలవారు మాత్రం ఎంతో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నార్ మార్క్.బైసెక్సువల్ కు ఈ వ్యాధి ఎక్కువగా సోకే అవకాశం ఉన్నా సరే ప్రతీ ఒక్కరూ జాగ్రత్త వహించాలని సూచించారు.ఈ వ్యాధి సోకిన వారు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని తెలిపారు.

అమెరికా వ్యాప్తంగా సుమారు 25వేలకు పైగా కేసులు ఉండగా కేవలం ఒక్కరు మాత్రమే మృతి చెందారని, మంకీపాక్స్ సోకిన వారు ఎలాంటి ఆందోళన చెందకుండా వైద్యుల సూచనలు పాటించాలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube