గడ్డ ఏదైనా ఓటమి ఎరుగని నైజం భారతీయుల సొంతం.భారతీయులు కనబరుస్తున్న విశిష్ట ప్రతిభకు విదేశాలు పట్టం కడుతున్నాయి, ఆయా దేశలలో ఉన్నత పదవి బాధ్యతలు అప్పగిస్తున్నాయి.
ప్రవైటు రంగాల్లోనే కాదు, అక్కడి రాజకీయరంగంలో కూడా మన వారు సామర్ధ్యాన్ని చాటుకుంటున్నారు.ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో మన తెలుగు తేజం సత్తా చాటింది.
ఏపీ లోని కృష్ణా జిల్లా కి చెందిన అరుణ మిల్లర్ అమెరికాలో ఘన చరిత్ర సృష్టించింది.పూర్తి వివరాల్లోకి వెళితే,అరుణ మిల్లర్, ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకి చెందిన మహిళ.
ఆమె పుట్టి పెరిగింది తెలుగు గడ్డపైనే అయిన, 1972 లో ఆమె తల్లితండ్రులు అమెరికాకు వలస వెళ్ళటం వలన ఆమె కూడా అక్కడే స్థిరపడిపోయారు.ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో మన అరుణ హాట్ టాపిక్ అయ్యారు.
ఆమె పడిన కష్టమే నేడు ఆమెకు దక్కుతున్న వైభవం.తాజాగా జరిగిన ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికాలోని మేరీల్యాండ్ నుంచీ పోటీ చేసిన ఆమె లెఫ్ట్ నెంట్ గవర్నర్ పదవిని దగ్గించుకున్నారు.
విశేషం ఏమిటంటే, ఎన్నికల ప్రచార సమయంలో, అమెరికా అధ్యక్షుడు జో బెడైన్, వైస్ ప్రెసిడెంట్ కమల హరీస్ కూడా ఈమెకు మద్దతుగా ప్రచారం చేశారు.ఇదిలా ఉంటే.
ప్రచార సమయంలో అరుణ ప్రత్యర్ధుల నుంచి గట్టి వ్యతిరేకతను ఎదురుకోవటమే కాకుండా, ఎన్నికల విజయం కోసం ఆమె హిందూ జాతీయ వాదులను ఆశ్రయించారని కూడా ఆరోపణలకు గురయ్యారు.అయితే అవేమి నిజం కాదని మిల్లర్ తీవ్రంగా ఖడించారు.ఎట్టకేలకు ఎన్నికలలో విజయం సాధించి, లెఫ్ట్నెంట్ గవర్నర్ గా పదివి తగ్గించుకున్న అరుణ మాట్లాడుతూ, “మేరేల్యాండ్ ప్రజలు ఓటుతో ఏమి చేయగలరో చూపించారు, విభజనకు బదులుగా ఐఖ్యతను ఎంచుకున్నారు.హక్కులను కాలరాయటానికి బదులుగా హక్కులను విస్తరించటాన్ని మీరు ఎన్నుకున్నారు” అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇక మరొక విషయం ఏమిటంటే మేరి ల్యాండ్ నుంచీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఎన్నికయిన మొట్టమొదటి భారతీయురాలు అరుణ కావడం విశేషం.