అగ్ర రాజ్యం అమెరికా ప్రపంచాన్నే శాసించగల శక్తిగా చెప్తుంటారు.తన మాటకి ఎదురు ఎవరు వచినా సరే వారిని నిర్దాక్షిణ్యంగా అనిచివేయడంలో ఒక్క నిమిషం కూడా ఆలోచించారు.
ఒక రకంగా చెప్పాలంటే అమెరికాకి ఎదురు నిలిచి పోరాడే శక్తి లేదనే చెప్పాలి.అయితే ఏ విషయంలో కూడా భయపడని అమెరికా ఒక విషయంలో మాత్రం గజగజా వణికిపోతుంది.
అమెరికా ప్రజలు ఆ ఒక్క విషయంలోనే ఎంతో భయంతో గడుపుతూ ఉంటారు.
ఇంతకీ అమెరికానే వణికించే శక్తి ఏమిటి అనుకుంటున్నారా.
అమెరికా ప్రజల గుండెల్లో రైళ్ళు పరిగెట్టించేది టోర్నడోలు.వీటి పేరు వింటేనే స్థానిక ప్రజలు కంగారు పడిపోతారు.
అవి సృష్టించే గాలి కొన్ని వేల కిలోమీటర్ల స్పీడుతో ఉంటుంది.టోర్నడోలు ధాటికి ఇళ్ళకు ఇళ్ళు నేలమట్టం అవుతాయి, గాలిలోకి కార్లు , చెట్లని తీసుకుపోతుంది అంటే ఎంత పెద్ద ఉపద్రవం వస్తుందో అర్థం చేసుకోవచ్చు.
అయితే తాజాగా అమెరికాలో మళ్ళీ ఈ టోర్నడోలు తమ ప్రతాపాన్ని చూపాయి.

ఒక్లాహౌమాలో వీటి ధాటికి ఇద్దరు మృతి చెందారు.మరి 29 మంది గాయాలపాలు అయ్యారు.క్షతగాత్రులని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తీరం వెంబడి 165 మైళ్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.దీని ప్రతాపానికి వేలాది మంది నిరాశ్రయు లయ్యారు.
దాంతో అలెర్ట్ అయిన ప్రభుత్వం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.