అమెరికాలో కరోనా ఊహించని మెరుపుదాడి..2700 మంది మృతి..!!!

అగ్ర రాజ్యం అమెరికా ప్రస్తుతం ఎదుర్కుంటున్న కరోనా విలయం గతంలో ఎన్నడూ అమెరికా ప్రజలు ఎదుర్కోలేదు.సహజంగా లగ్జరీ లైఫ్ కి అలవాటుపడిన అమెరికా ప్రజలు ప్రస్తుత పరిస్థితులని ఎదుర్కోలేక పోతున్నారు.

 America, Donald Trump, Corona Virus, Lock Down, Technology, Fast Foods-TeluguStop.com

సహజ జీవనానికి దూరంగా టెక్నాలజీ ప్రపంచానికి, ఫాస్టెస్ట్ ఫుడ్స్ కి దగ్గరగా ఉన్న అమెరికా ప్రజలు కరోనా దెబ్బకి కాకలావిలాం అయ్యిపోతున్నారు.రోజు రోజుకి కరోనా వైరస్ ని తట్టుకోలేక ప్రాణాలు వదిలేస్తున్న వారి సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతూ వస్తోంది.

గడిచిన రెండు మూడు రోజులుగా కరోనా ప్రభావం బాగా తగ్గిందని మృతుల సంఖ్య సైతం చాలావరకూ తగ్గుముఖం పట్టిందని అమెరికాలో ఇక కరోనా మెరుగైపోతుందని లెక్కలు వేశారు నిపుణులు.కానీ అందరి లెక్కలు తప్పయ్యాయి.

అంచనాలని మించి కరోనా గడిచిన 24 గంటలలో తీవ్ర రూపం దాల్చింది.ఫలితంగా 2,700 మంది మృతి చెందారు.

దాంతో లాక్ డౌన్ ఎత్తివేయాలని ఆలోచన చేస్తున్న అమెరికా రాష్ట్రాల ప్రతినిధులు మరోసారి సంశయంలో పడ్డారు.

Telugu America, Corona, Donald Trump, Fast Foods, Lock-

అమెరికా వ్యాప్తంగా ఇప్పటి వరకూ సుమారు 45 వేల మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది.భాదితుల సంఖ్య ఏకంగా 8.19 లక్షలకి చేరుకుంది.దాంతో కరోనా ఇప్పట్లో తగ్గుతుందనే ఆలోచనని పక్కన పెట్టేశారు అమెరికన్స్.అయితే ఈ కరోన మహమ్మారి వ్యాప్తికి ప్రధాన కారణం ట్రంప్ అని తేలిపోవడంతో అమెరికా ప్రజలు ట్రంప్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube