అమెరికాలో ఎన్నికలు జరుగుతాయా..??

అమెరికాలో కరోనా ప్రభావం ఎలాంటి ఫలితాలని చూపిస్తోందనేది అందరికి తెలిసిందే.కరోనా దెబ్బకి అమెరికాలోని కొన్ని ప్రాంతాలు శవాల దిబ్బలుగా కనిపిస్తున్నాయి.

 America, Corona Virus, Elections, Polling Staff, Donald Trump, Republican Party,-TeluguStop.com

అమెరికన్స్ నమ్మలేంతంగా అదేదో సినిమాలో చూపించినట్టుగా అమెరికా పరిస్థితి అత్యంత అద్వానంగా తయారయ్యింది.ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 39 వేలకి చేరుకోగా ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 7.40 లక్షలకి చేరుకుంది.అయితే ఈ పరిణామాల నేపధ్యంలో అమెరికాలో ఎన్నికలు జరుగుతాయో లేదో అనే చర్చ ఇప్పుడు జోరుగా జరుగుతోంది.

అమెరికా జీవితాని ప్రతీ కోణంలో కరోనా ప్రభావితం చేసింది.ఈ పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు ట్రంప్ అండ్ కో.ఇప్పటికే చాలా రాష్ట్రాలు ప్రైమరీలని జూన్ వరకూ వాయిదా వేశాయి.నవంబర్ లో జరగాల్సిన అధ్యక్ష ఎన్నికలపై ఈ వైరస్ ప్రభావం ఎలా ఉంటుందోనని ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ డెమోక్రటిక్ పార్టీలు అంచనాలు వేస్తూ విశ్లేషణలు చేస్తున్నాయి.

Telugu America, Corona, Democratic, Donald Trump, Staff, Republican-

ఇప్పటికే కొన్న దేశాలలో జరగవలసిన ఎన్నికలలో పోలింగ్ సిబ్బంది లేక, ఎన్నికల కేంద్రాలలో నిర్వహణ బాధ్యతలు చూసేవారు లేకపోవడంతో ఎన్నికలు తాత్కాలికంగా నిలిపివేశారు.అమెరికా ఇందుకు మినహాయింపు కాదని అమెరికాలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అందుకే ఎన్నికలని వాయిదా వేయడమే మంచిదని అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు పలువురు నిపుణులు.కానీ ట్రంప్ మాత్రం ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనంటూ పట్టుపడుతున్నారు.ఈ పరిస్థితులలో ట్రంప్ పంతం నెగ్గుతుందో లేక ఎన్నికలు వాయిదా పడుతాయో లేదో తేలాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube