ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసిందని స్టార్ హీరో కూతురు ని దారుణంగా...

సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీల గురించి ఏదైనా ఓ వార్త బయటికి పొక్కిందంటే చాలు కొందరు అదే పనిగా నెగిటివ్ గా ట్రోల్స్ చేయడం మరియు అసత్య ప్రచారాలను చేయడం వంటివి చేస్తూ సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేస్తుంటారు.కాగా బాలీవుడ్ స్టార్ స్టార్ హీరో అయిన అమీర్ ఖాన్ కూతురుని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు.

 Ameer Khan Daughter Ira Khan Trolled By Netizens-TeluguStop.com

ఇంతకీ విషయం ఏమిటంటే ఇటీవలే అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ తన తన నూతన ప్రియుడుతో కలిసి దిగినటువంటి ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ మరియు ఇతర సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసింది.అయితే ఈ ఫోటోలలో ఇరా ఖాన్ తన ప్రియుడు నుపూర్ శిఖరాతో కొంతమేర చనువుగా ఉంటూ అలాగే కౌగిలించుకుంటూ కనిపించింది.

దీంతో కొందరు నెటిజన్లు ఈ అమ్మడి ఫోటోలను నెగిటివ్ గా ట్రోల్స్ చేస్తున్నారు.అంతేకాకుండా స్టార్ హీరో కూతురు హోదాలో ఉన్నటువంటి ఓ యువతి వ్యక్తి గతంగా ఉంచుకోవాల్సిన ఫోటోలను ఇలా బహిరంగంగా షేర్ చేయడం, అలాగే పబ్లిక్ లో చనువుగా ప్రవర్తించడం వంటివి చేయడం వల్ల తన తండ్రి ఇమేజ్ దెబ్బ తింటుందని కామెంట్లు చేస్తున్నారు.

 Ameer Khan Daughter Ira Khan Trolled By Netizens-ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసిందని స్టార్ హీరో కూతురు ని దారుణంగా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో కొందరు అమీర్ ఖాన్ అభిమానులు మాత్రం సెలబ్రిటీలకు కూడా తమ వ్యక్తిగత జీవితం ఉంటుందని అంతేకాకుండా ఎవరూ హద్దు మీరి ప్రవర్తించడం లేదని ఘాటుగా సమాధానం ఇస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే అమీర్ ఖాన్ తన రెండో భార్య కిరణ్ రావు కి విడాకులు ఇచ్చాడు.ఇందుకుగాను భరణంగా దాదాపుగా “నాలుగు వందల కోట్ల రూపాయల” పైచిలుకు విలువ చేసే ఆస్తులను భరణంగా ఇచ్చినట్లు సమాచారం.కాగా ప్రస్తుతం అమీర్ ఖాన్ బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు “అద్వైత చందన్” దర్శకత్వం వహిస్తున్న “లాల్ సింగ్ చద్ద” చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా టాలీవుడ్ ప్రముఖ హీరో అక్కినేని “నాగ చైతన్య” గెస్ట్ అప్పీయరెన్సు పాత్రలలో నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ముంబై నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

#Ameer Khan #Khan #Netizens #AmeerKhan #Trolls

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు