సంచలనం: అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన అంబటి రాయుడు  

Ambati Rayudu Announces Retirement-

అంతర్జాతీయ క్రికెట్ లో సంచలనం చోటుచేసుకుంది.ప్రముఖ తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

Ambati Rayudu Announces Retirement- -Ambati Rayudu Announces Retirement-

ఇంగ్లాండ్ లో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీ కి రాయుడుని ఎంపిక చేయక పోవడం తో మనస్తాపం చెంది ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.ఈ సారి ప్రపంచకప్ టోర్నీకి తనను ఎంపిక చేయకుండా మయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేయడం, తనను త్రీడీ ఆటగాడిగా అభివర్ణించడంపై మనస్తాపం చెంది అంబటి రాయుడు ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తనను కాకుండా విజయ్ శంకర్ ని ఈ టోర్నీ కోసం ఎంపిక చేయడం తో చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కె ప్రసాద్ వివరణ కూడా ఇచ్చారు.అయితే ఈ వివరణ పై రాయుడు కౌంటర్ ఇవ్వడం, ఆ తరువాత విజయ శంకర్ గాయపడడం ఇవన్నీ జరిగిపోయాయి.

అయితే ఈ సారి అయినా రాయుడి కి అవకాశం లభిస్తుంది అని చూడగా ఈ సారి కూడా రాయుడుకి కాకుండా ఒక్క వన్డే గేమ్ కూడా ఆడని మయాంక్ అగర్వాల్ కు అవకాశం ఇచ్చారు.దీనితో మనస్తాపానికి గురైన రాయుడు ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

ఇటీవల యువ రాజ్ సింగ్ తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.ఇప్పుడు తాజగా రాయుడు కూడా తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతూ సంచలన నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చకు దారి తీసింది.

1985, సెప్టెంబర్ 23 న జన్మించిన రాయుడు 2001-02లో రంజీ టోర్నీలో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.ఆ తరువాత 2005-06 రంజీ సీజన్ లో ఏపీ తరఫున ఆడిన రాయుడు 2003-04 అండర్ 19 ప్రపంచకప్ లో భారత జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు.అలానే 2015 ప్రపంచకప్ తుదిజట్టులో చోటు దక్కించుకున్న రాయుడు ఇప్పటివరకూ 55 వన్డేలు ఆడగా, 47.06 సగటుతో 1694 పరుగులు చేశాడు.

వన్డేల్లో అత్యధికంగా 124 స్కోర్ నమోదుచేశాడు.ఇక ఐపీఎల్ లో 147 మ్యాచ్ లు ఆడిన రాయుడు 3,300 పరుగులు చేసి ఒక మంచి క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

తాజా వార్తలు