ఐపీఎల్ 2020 నుండి అంబటి రాయుడు దూరం కాబోతున్నాడా…? లేకపోతే…?!  

Ambati Rayudu will miss one more game , Ambati Rayudu, IPL2020, health Condition, Fitness, CSK, Rajasthan Royals - Telugu Ambati Rayudu, Ambati Rayudu Will Miss One More Game, Csk, Fitness, Health Condition, Ipl, Ipl 2020, Ipl2020, Rajasthan Royals, Rajestan Royals

ఐపీఎల్ 13 వ సీజన్ మొదలైంది.అయితే ఈ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ కు అసలు కలిసి రావడం లేదు.

TeluguStop.com - Ambati Rayudu Fitness Issue Ipl2020

సీజన్ మొదలు కాక ముందు నుంచి టీం సభ్యులలో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే.అయితే వారందరూ ట్రీట్మెంట్ తీసుకోవడంతో కరోనా నుండి జయించారు.

ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని కీలక ఆటగాడు సురేష్ రైనా కూడా తన పర్సనల్ విషయం కారణంగా తిరిగి భారత్ కు చేరుకున్నాడు.దీనితో అతడు టోర్నీ నుండి వైతొలిగాడు.

TeluguStop.com - ఐపీఎల్ 2020 నుండి అంబటి రాయుడు దూరం కాబోతున్నాడా… లేకపోతే…-General-Telugu-Telugu Tollywood Photo Image

నిజానికి ఇది చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు పెద్ద దెబ్బే.ఇక అలాగే సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా తన పర్సనల్ కారణాల వల్ల టోర్నీ నుంచి తప్పుకున్నాడు.

ఇక ఇన్ని సమస్యలు దాటుకొని ఎట్టకేలకు సీజన్ మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ తో తలపడింది.ఆ మ్యాచ్లో విజయం కూడా సాధించింది.


అయితే ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు అంబటి రాయుడుకు తొడ కండరాలు పట్టేసాయి.ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ తన రెండో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడింది.

అయితే మొదటి మ్యాచ్ లో సూపర్ హిట్ అయిన అంబటి రాయుడు రెండో మ్యాచ్లో ఆడలేకపోయాడు.దీనికి కారణం అంబటి రాయుడు తొడ కండరాలు పూర్తిగా పట్టేయడమే.

ఇందుకు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం ముందస్తు జాగ్రత్తగా అంబటి రాయుడుకు మరో రెండు మ్యాచ్లను విశ్రాంతి ఇవ్వాలని ఆలోచిస్తుంది.


అయితే, తొడ కండరాలు పట్టేయడంతో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమేనో లేకపోతే ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి అంబటి రాయుడు దూరం కాబోతున్నాడో అర్థం అవ్వట్లేదు.

రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కు ముందు అంబటిరాయుడు 100% ఫిట్ నెస్ సాధించలేకపోవడంతో అతనిని మ్యాచ్ కు దూరంగా పెట్టారు.ముంబై ఇండియన్స్ లో జరిగిన మ్యాచ్లో అంబటి రాయుడు 48 బంతుల్లో 71 పరుగుల ను సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

#Ipl 2020 #Ambati Rayudu #Fitness #AmbatiRayudu #Rajestan Royals

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ambati Rayudu Fitness Issue Ipl2020 Related Telugu News,Photos/Pics,Images..