రాయుడు చేసిన తప్పేంటి! కలని దూరం చేస్తున్న క్రికెట్ రాజకీయం

అంబటి తిరుపతి రాయుడు.దశాబ్దం కాలంగా ఇండియన్ క్రికెట్ టీం లో ఈ పేరు భాగా పాపులర్.

 Ambati Rayudu Comes With A Satiric Tweet After Exclusion-TeluguStop.com

సచిన్ లాంటి స్టార్ క్రికెటర్ ని సైతం మెప్పించిన ఆటగాడు.ఎంతో ప్రతిభ ఉంది.

ఒక బ్యాట్స్ మెన్ గా దేశవాళీ క్రికెట్ లో చాలా సార్లు సత్తా చాటాడు.అయితే అతను కేవలం ఆంధ్రాకి చెందిన ఆటగాడు అనే ఒకే ఒక్క కారణం.

టీం ఇండియాలో, అలాగ్గే సెలక్షన్ కమిటీలో నార్త్ ఇండియా ఆధిపత్యం రాయుడుకి వరల్డ్ కప్ క్రికెట్ ఆడే అవకాశం రాకుండా చేస్తుంది.

క్రికెట్ తో పాటు ఎప్పుడు వివాదాలకి కేరాఫ్ గా ఉండే రాయుడు క్రికెట్ ని సాశించేవారితోనే ఎక్కువగా గొడవ పడిన సందర్భాలు ఉన్నాయి.

ఈ కారణంగా గతంలో చాలా అవకాశాలని రాయుడు దూరం చేసుకున్నాడు.అయితే క్రింద పడిన ప్రతిసారి మళ్ళీ నిరూపించుకొని సత్తా చాటడం రాయుడులో ఉండే ప్రత్యేకత.ఈ లక్షణమే అతనికి చాలా ఏళ్ల తర్వాత టీం ఇండియాకి ఆడే అవకాశం తెప్పించింది.దీంతో టీం ఇండియా తరుపున ఆడిన ప్రతిసారి రాయుడు తన సత్తా చాటాడు.

ఈ సారి ప్రపంచ కప్ ఆడే జట్టులో కచ్చితంగా స్థానం వస్తుందని ఆశించాడు.అయితే ఈ సారి కూడా రాయుడు కల కలగానే మిగిలిపోయింది.

వరల్డ్ కప్ క్రికెట్ జట్టుని ఎంపిక చేసిన చీఫ్ సెలక్షన్ ఆఫీసర్ ఆంధ్రా వాడు అయిన కూడా రాయుడుని అతను ప్రాధాన్యత ఇవ్వలేదు.

పైగా రాయుడుని తీసుకోకపోవడానికి అర్ధం కాని కారణాలు చెప్పాడు.దీంతో అంబటి రాయుడు తన అసంతృప్తిని సోషల్‌ మీడియాలో వ్యక్తపరిచాడు.నాలుగో నెంబర్‌లో అతడిని కాదని విజయ్‌ శంకర్‌ను తీసుకున్న విషయం తెలిసిందే.

రాయుడుకి చాలా అవకాశాలు ఇచ్చామని, కానీ శంకర్‌ మూడు రకాలుగా ఉపయోగపడతాడని చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ చెప్పడంతో దీనికి సమాధానంగా రాయుడు ‘ప్రపంచక్‌పను వీక్షించేందుకు ఇప్పుడే 3డీ అద్దాలను ఆర్డర్‌ చేశాను’ అని ట్విటర్‌లో వ్యంగ్యంగా పోస్ట్‌ చేసి తన అసంతృప్తిని చూపించుకున్నాడు.మరో వైపు గంబీర్ కూడా రాయుడుకి మద్దతుగా నిలబడటం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube