చంద్రబాబు కన్నీళ్లు : ఆధారాలు అడుగుతున్న వైసీపీ ?

నిన్న ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనమే చోటు చేసుకుంది.సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన టిడిపి అధినేత చంద్రబాబు అసెంబ్లీలో వైసిపి  ఎమ్మెల్యేలు ,మంత్రులు చేసిన కొన్ని వ్యక్తిగత కామెంట్స్ పై మీడియా సమావేశం నిర్వహించి మరీ కన్నీళ్లు కార్చారు.

 Ambati Rambabu React On Chandrababu Comments, Chandrababu , Cbn, Tdp, Ap, Ysrcp,-TeluguStop.com

తన భార్యను అవమానపరిచే విధంగా వైసిపి నాయకులు విమర్శలు చేశారని బాబు కన్నీటి పర్యంతం అయ్యారు.ఇది వ్యవహారం పెద్ద సంచలనమే సృష్టించింది.

అయితే దీనిపై స్వయంగా ఏపీ సీఎం జగన్ సైతం స్పందించి ఎక్కడా  వ్యక్తిగత విమర్శలకు తాము దిగలేదని , అసలు ఆ సమయంలో తాను సభలో లేను అని, కలెక్టర్లతో వర్షాలు, వరదల పరిస్థితిపై రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నాను అంటూ క్లారిటీ ఇచ్చారు.దీనిపై వైసిపి టిడిపి పెద్దఎత్తున ఒకరిపై ఒకరు విమర్శలకు దిగారు.

  తాజాగా ఈ వ్యవహారంపై వైసిపి సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు.స్వభావరీత్యా జిత్తులమారి అయిన చంద్రబాబు మామ ఎన్టీఆర్ ను,  నేడు భార్య ను అడ్డంపెట్టుకుని దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు.

చంద్రబాబు అర్ధాంగి భువనేశ్వరిని తాము ఏదో అన్నామని చెబుతున్నారు , ఆమెను నేను కానీ , మా పార్టీ వాళ్ల కానీ ఏమీ అనలేదు.  చేతులు జోడించి నమస్కరించి చెబుతున్నాం .మహిళలను అనే స్వభావం మాది కాదు.చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నారు.

నాడు ఎన్టీఆర్ ను అడ్డంపెట్టుకుని రాజకీయాల్లో ఎదిగి ఆయనకు వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారు.ఈరోజు భార్యను అడ్డుపెట్టుకుని సానుభూతి పొందాలని డ్రామాలు చేస్తున్నారు.

భువనేశ్వరి అన్నట్లు ఆధారాలు ఉంటే చంద్రబాబు బయటపెట్టాలని,  ఈ విషయంలో భువనేశ్వరి కూడా చంద్రబాబు ను నిలదీయాలి అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
 

Telugu Ap Asembly, Ap Cm, Ap, Chandrababu, Jagan, Bhuvaneswari, Sattenapallimla,

  గతంలో జగన్ టిడిపి ఆఫీసులోని ప్రెస్ మీట్ పెట్టించి వ్యక్తిగత విమర్శలు చేయించారు అని,  ఆ సందర్భంగా జగన్ తనను ఎవరు ఏ విధంగా దూషించాతో బహిరంగంగానే చెప్పారు.అదే మీ గురించి మీ కుటుంబ సభ్యుల గురించి నేను ఏదైనా తప్పు మాట్లాడితే,  అసెంబ్లీ రికార్డ్స్ లో ఉంటాయి కదా బయట పెట్టండి.వాస్తవాలను కప్పి పెట్టి సానుభూతి కోసం దిగజారవద్దు.

ఇప్పటికీ తెలంగాణలో కనుమరుగైన టీడీపీ ఏపీలో కూడా కనుమరుగవుతుందని రాంబాబు విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube