అంబటికో అనుమానం ! పార్టీ ఎందుకు పెట్టావ్ పవన్ ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పై ఎప్పుడూ ఏదో ఒక విమర్శ చేస్తూ వార్తల్లో  ఉంటారు సత్తెనపల్లి ఎమ్మెల్యే ఏపీ మంత్రి అంబటి రాంబాబు( Ambati Rambabu ).తాజాగా పవన్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకొని విమర్శలు చేశారు రాంబాబు.

 Ambati Doubt That Pawan, Why Did You Throw A Party ,pavan Kalyan, Telugudesam, T-TeluguStop.com

పల్నాడు జిల్లాలో మంత్రులు రోజా, అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు,  పార్టీ నేతలు ఇంటింటికి తిరుగుతూ జగనన్నే మా భవిష్యత్తు స్టిక్కర్లను అంటిస్తున్నారు.వైసిపి ప్రభుత్వం( YSP Govt ) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేకూరుతున్న లబ్ధి,  ప్రభుత్వం పై జనాల్లో ఉన్న అభిప్రాయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న క్రమంలో జనసేనను టార్గెట్ చేసుకుని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.అసలు జనసేన పార్టీని( Janasena party ) ఎందుకు పెట్టారో పవన్ కళ్యాణ్ కే తెలియదని ఎద్దేవా చేశారు.

రాబోయే ఎన్నికల్లో జగన్ ను ఓడించడానికి జనసేన పార్టీ పెట్టావా లేక చంద్రబాబు పల్లకి మోయడానికి పార్టీ పెట్టాడా పవన్ సమాధానం చెప్పాలని రాంబాబు నిలదీశారు.ఒంటరిగా పోటీ చేయలేని పార్టీలకు ఈ రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడాలన్నారు.మీకు మంచి జరిగితే నన్ను ఆశీర్వదించండి లేదంటే నన్ను ఆశీర్వదించవద్దు అని సూటిగా ధైర్యంగా చెప్పగలిగిన ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని మంత్రి రాంబాబు అన్నారు.జగన్ పై ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా,  ఎవరు ఎంత మందితో కలిసి వచ్చినా, 

ప్రజలు చితకొట్టి పంపిస్తారని రాంబాబు అన్నారు.ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా వైసిపి అంటిస్తున్న స్టిక్కర్లకు పోటీగా టిడిపి, జనసేనలో స్టిక్కర్లు అంటిస్తుండడం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండడం పైన రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ పై ఈ విధంగా మండిపడ్డారు.అంబటి విమర్శలపై జనసేన ఏ విధంగా రియాక్ట్ అవుతుందో?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube