ఆ జంట చేసిన పనికి నోరెళ్ళబెట్టిన సుమ.. ఏకంగా అందరి ముందు?

బుల్లితెరలో ఎన్నో ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్ లు ప్రసారమవుతున్నాయి.పలు టీవీ ఛానల్లో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా ప్రసారం కావడంతో ప్రేక్షకులు కూడా ఇటువంటి షో లకే అలవాటు పడిపోయారు.

 Ambati Arjun And His Wife Surekha In Suma Cash Show-TeluguStop.com

ఇక అందులో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం అంటే సుమ ప్రోగ్రాం అని చెప్పవచ్చు.అది ఏ ప్రోగ్రాం అయినా కానీ సుమ ఉంటే మాత్రం ఆ హైలెట్ వేరుగా ఉంటుంది.

తన మాటలతో, పంచ్ డైలాగులతో ఎంతో మంది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

 Ambati Arjun And His Wife Surekha In Suma Cash Show-ఆ జంట చేసిన పనికి నోరెళ్ళబెట్టిన సుమ.. ఏకంగా అందరి ముందు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇప్పటికే పలు షోలలో కాస్త రొమాంటిక్ సీన్‌ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అంతేకాకుండా హద్దులు దాటి ప్రవర్తించడం వల్ల అధిక రేటింగ్ వస్తుందన్న ఆశతో ఇష్టమొచ్చినట్లు చేస్తుంటారు.ఇక ఇలాంటివన్నీ సుమ యాంకరింగ్ చేసే షోలలో ఎక్కువగా కనిపించవు.కానీ తాజాగా సుమ షో లో అలా కనిపించేసరికి వెంటనే సుమ షాక్ అయ్యింది.

ప్రస్తుతం సుమ ఎన్నో ప్రోగ్రాం లలో బిజీగా ఉండగా.

ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ ప్రోగ్రాం లో కూడా బాగా బిజీగా ఉంటుంది.ఇక తాజాగా ఈ ప్రోగ్రామ్ కు రియల్ జంటగా అగ్నిసాక్షి, దేవత ఫేం అర్జున్, అతని భార్య సురేఖ గెస్ట్ గా వచ్చారు.

ఇక రీల్ జంటగా నవ్య స్వామి, రవి కృష్ణ లు వచ్చారు.ఇక తాజాగా ఈ ఎపిసోడ్ సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో అర్జున్ తన భార్యకు ప్రపోజ్ చేశాడు.

తాజ్ మహల్ అంత తెల్లనైన స్వచ్ఛమైన మనసు నీది.ఎప్పుడు చెప్పేదే, గొడవ ఎప్పుడైనా, తప్పు ఎవరిదైనా, నువ్వే కాంప్రమైజ్ అవుతావు, మాట్లాడుతావు.

నేను కూడా అలా ఉండటానికి ట్రై చేస్తాను.గొడవ ఎంత పెద్దదైనా నన్ను వదిలేయకు అంటూ ఓ రోజా పువ్వును తన భార్యకిచ్చాడు.

ఆ పువ్వు తన మునిపంటి లో పెట్టుకున్న సురేఖ.దానిని అర్జున్ తన నోటితో పువ్వు లాగేసుకున్నాడు.

వెంటనే సుమ షాకుతో నోరెళ్ళబెట్టింది.ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.

#Navya Swamy #Ravi Krishna #AgnisakshiFame #AnchorSuma #Ambati Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు