తొమ్మిదేళ్ళ క్రితం సినిమా విషయంలో హీరో ఆర్యకి కోర్టు నోటీసులు

సినిమాలలో కొన్ని సన్నివేశాలు, లేదంటే పాత్రలు, కొన్ని డైలాగ్స్ ఒక వర్గాన్ని కించపరిచే విధంగా ఉన్నాయంటూ ఈ మధ్య కాలంలో కుల సంఘాలు, అలాగే ప్రజా సంఘాలు అంటూ కొంత మంది అదే పనిగా కోర్టులకి వెళ్ళడం, ఆ సన్నివేశాలు తొలగించాలని డిమాండ్ చేయడం, సినిమాని ఆపాయాలని ధర్నాలు చేయడం చేస్తూ ఉంటారు.ఈ మధ్య కాలంలో సినిమాల విషయంలో ఈ రచ్చ మరీ ఎక్కువైంది.

 Ambasamudram Court Issues Notice To Actor Arya, Vaadu Veedu Movie, Hero Aarya, H-TeluguStop.com

ఎక్కడికక్కడ కుల సంఘాలు విపరీతంగా పుట్టుకోచ్చేశాయి.అలాగే ప్రాంతాల వారీగా కొంత మంది సంఘాలు పెట్టి పోరాటాల పేరుతో స్వార్ధ రాజకీయాలకి పాల్పడుతున్నారు.

ఇలాంటి వారు అవకాశాన్ని బట్టి సినిమాలని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు.సినిమాలని టార్గెట్ చేస్తే కావాల్సినంత పబ్లిసిటీ వస్తుందని ఈ రకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అయితే ఎప్పుడో తొమ్మిదేళ్ళ క్రితం ఆర్య, విశాల్ హీరోలుగా నటించి బాల దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా విషయంలో కోర్టు హీరో ఆర్యకి నోటీసులు పంపించింది.

9 ఏళ్ల క్రితం ఆర్య నటించిన సినిమా అవన్ ఇవన్ సినిమాలో సింగంపట్టి జమీన్‌ను అవమానపరిచే సన్నివేశాలు ఉన్నాయంటూ తిరునెల్వేలి అంబా సముద్రం కోర్టులో అప్పట్లో పిటిషన్ దాఖలు కాగా, తాజాగా ఇది విచారణకు వచ్చింది.సినిమాలో హిందూ దేవుళ్లు, సోరిముత్తు అయ్యనార్, సింగంపట్టి జమిందార్‌లను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ దర్శకుడు బాల, ఆర్యలపై పిటిషనర్ అప్పట్లో కోర్టుకెక్కాడు.శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ నెల 28న తమ ఎదుట హాజరు కావాలంటూ ఆర్యకు నోటీసులు జారీ చేసింది.

అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ 2018లో మద్రాస్ హైకోర్టులోని మదురై బెంచ్‌ను ఆర్య ఆశ్రయించాడు.అక్కడ పిటీషన్ ఇంకా విచారణకి రాలేదు.ఇప్పుడు ఆర్యకి అంబసముద్రం కోర్టు నోటీసులు పంపించింది.దీనిపై ఆర్య ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube