భారత్ లో అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ తీసుక రాబోతున్న అంబానీ...?!

ప్రతిరోజు మార్కెట్ లోకి ఏదో ఒక కొత్త మొబైల్ రిలీజ్ అవుతూనే ఉంటాయి.సరికొత్త ఆప్షన్స్, సరికొత్త టెక్నాలజీ వాడుకొని వివిధ కంపెనీలు కొత్త ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉన్నాయి.

 Reliance Mukesh Ambani Plans For Cheapest Smart Phone In India, Smart Phone, Muk-TeluguStop.com

అయితే కొన్ని మొబైల్ కంపెనీలు తక్కువ ధరకు అందివ్వాలని ప్రయత్నం కూడా చేస్తున్నాయి.కాకపోతే, ఇప్పటికే భారతదేశం మార్కెట్లోకి పెద్ద ఎత్తున తక్కువ ధరకే ఫోన్లు వచ్చినా అవి భారతీయులను ఎక్కువగా ఆకట్టుకోలేకపోతున్నాయి.

ఇదే నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అతి తక్కువ ధరకు భారతీయులకు ఫోన్ అందజేసే విధంగా అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం భారతదేశంలో మొబైల్ లీడ్ గా ఉన్న చైనా దేశపు కంపెనీ షియోమి సంస్థపై ఆధిపత్యం సాధించే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రాణిలికలను సిద్ధం చేస్తున్నారు.

ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు అనేక వార్తలు వినిపిస్తున్నాయి.కేవలం 4000 నుండి 5000 రూపాయల మధ్యలోని అన్ని ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ అందించాలన్న ఉద్దేశంతో ముఖేష్ అంబానీ భారతదేశంలోని మొబైల్ ఫోన్ కంపెనీలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

ఆండ్రాయిడ్ ఓఎస్ తో పనిచేసే మొబైల్స్ ను భారత మార్కెట్లోకి ప్రవేశ పెట్టాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గట్టిగా ప్రయత్నిస్తున్నారు.అయితే, ముఖేష్ అంబానీ అంచనా ప్రకారం వచ్చే రెండు సంవత్సరాల్లో ఏకంగా 200 మిలియన్ స్మార్ట్ ఫోన్ విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అత్యంత చౌకగా రిలయన్స్ జియో డేటాను అందించడంలో విజయవంతం సాధించింది.ఇప్పుడు భారతదేశంలోని కేవలం 4000 రూపాయలకు అన్ని హంగులు కలిగిన స్మార్ట్ ఫోన్ కనుక మార్కెట్లోకి వస్తే అది కచ్చితంగా ట్రెండ్ సెట్టర్ గా మారే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఇదివరకు కేవలం టెలికాం రంగంలో తీసుకువచ్చిన మార్పులను ఇప్పుడు మొబైల్ ప్రపంచంలో కూడా తీసుకురావాలని ముకేశ్ అంబానీ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇందుకోసం భారతదేశ కంపెనీలైన కార్బన్, లావా, డిక్సన్ టెక్నాలజీ కంపెనీలతో రిలయన్స్ జియో అధికారులు సంప్రదింపులు సాగిస్తున్నారు.

ఇలా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో వాడకం ద్వారా భారతదేశంలో అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అడుగులు కూడా వేస్తున్నారు.చూడాలి మరి మొబైల్ రంగంలో కూడా ముకేశ్ అంబానీ ఎన్ని మార్పులు తీసుకురాబోతున్నారో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube