మాస్టర్ సినిమాను అమెజాన్ ఎంత పెట్టి కొనిందో తెలుసా?

తమిళ స్టార్ విజయ్ హీరోగా, విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు విడుదలైన “మాస్టర్” చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా థియేటర్లలో విడుదలై కేవలం పదిహేను రోజులు అయినప్పటికీ ఈ సినిమా అప్పుడే ఓటీటిలో ప్రసార కావడంతో కొంత వరకు అభిమానులకు నిరాశ పరిచిన, నిర్మాతలకు మాత్రం ఎంతో ఆనందం ఇస్తుందని చెప్పవచ్చు.

 Amazon Prime Video Bought Vijay's Master Movie For 36crores, Amazon Prime Video,-TeluguStop.com

మంచి కథనం తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షక ఆదరణ లభించడంతో అమెజాన్ ఏకంగా ఈ సినిమాను భారీ మొత్తంలో కొనుగోలు చేసింది.
ట్రేడ్ వర్గాల మేరకు అందిన సమాచారం ప్రకారం అమెజాన్ ప్రైమ్ “మాస్టర్” సినిమా డిజిటల్ రైట్స్ ను ఏకంగా 36 కోట్ల రూపాయలను చెల్లించి అమెజాన్ సొంతం చేసుకుందని సమాచారం.

అయితే అమెజాన్ ప్రైమ్ మొదటిగా ఈ చిత్రాన్ని కి 20 కోట్లు చెల్లిస్తామని తెలియజేశారు.సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత మరో 16 కోట్ల రూపాయలను అధికంగా చెల్లించి అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను సొంతం చేసుకున్నారు.

అయితే ఇంతకు ముందు అగ్రిమెంట్ ప్రకారం సినిమా రిలీజ్ అయిన 15 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయాలని అగ్రిమెంట్ ఉండడంతో ప్రస్తుతం అమెజాన్ అదే అగ్రిమెంటును అనుసరిస్తున్నారు.

Telugu Amazon, Amazon Prime, Amazonprime, Master, Ott, Tamil, Vijay, Vijays Mast

కరోనా కారణం వల్ల థియేటర్లు మూతపడడంతో ఓటీటి ఫ్లాట్ ఫామ్ కి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు.ఈ సందర్భంగానే అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను ఓటీటిలో విడుదల చేయడంతో తమ ఛానల్ కు మరింత మంది సబ్ స్కైబర్లు పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ అంచనా వేస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు 200 కోట్ల రూపాయల వరకు వసూలు రాబట్టింది అనే సమాచారం వినబడుతోంది.

ఈ చిత్రం వసూలు చేసిన కలెక్షన్స్, ఆదరించిన తీరు ఎంతోమంది నిర్మాతలకు ధైర్యాన్ని ఇచ్చి తమ సినిమాలను కూడా థియేటర్లలో విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పవచ్చు.తమిళంతో పాటు కన్నడ, హిందీ, తెలుగు,మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం మంచి గుర్తింపును తెచ్చుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube