ఎఫ్3 డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్  

Amazon Prime Take F 3 Digital Rights, Tollywood, Telugu Cinema, Venkatesh, Varun Tej, Anil Ravipudi, Tamannaah, Dil Raju - Telugu Amazon Prime, Anil Ravipudi, Digital Rights, Dil Raju, F3 Movie, Tamannaah, Telugu Cinema, Tollywood, Varun Tej, Venkatesh

కమర్షియల్ డైరెక్టర్ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న టాలెంటెడ్ దర్శకుడు అనిల్ రావిపూడి.ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వరుసగా ఐదు బ్లాక్ బస్టర్ హిట్స్ తో కెరియర్ లో మంచి స్పీడ్ మీద ఉన్నాడు.

TeluguStop.com - Amazon Prime Take F 3 Digital Rights

ఆడియన్స్ కి కావాల్సిన అంశాలని కరెక్ట్ గా సినిమాలో ఉండేలా ప్రెజెంట్ చేసుకొని తెరపై నవ్వులు పూయించే ఈ దర్శకుడు చివరిగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టాడు.ఈ సినిమాతో విజయశాంతి మళ్ళీ నటిగా రీఎంట్రీ ఇచ్చింది.

ఇక చాలా కాలం తరువాత మళ్ళీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరపై నవ్వులు పండించాడు.రొటీన్ సీరియల్స్ రోల్స్ లో మహేష్ ని చూస్తున్న ప్రేక్షకులకి కొంత ఊరట కలిగించాడు.

TeluguStop.com - ఎఫ్3 డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే ఇప్పుడు తన కెరియర్ లో ఫుల్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఎఫ్2కి సీక్వెల్ ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.ఎఫ్2కి కొనసాగింపుగానే ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.దీనిలో వెంకటేష్, వరుణ్ తేజ్ తో పాటు మరో హీరో కూడా ఉండబోతున్నాడని చెప్పాడు.

అయితే ఆ హీరో ఎవరనేది ఇంకా రివీల్ చేయలేదు.ఇదిలా ఉంటే ఎఫ్2 సినిమా దిల్ రాజుకి వంద కోట్లకి పైగా కలెక్షన్స్ తీసుకొచ్చింది.

ఈ నేపధ్యంలో ఎఫ్3కి కొంత బడ్జెట్ పెరిగింది.అయినా కూడా దిల్ రాజు ఏకంగా 70 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇంకా షూటింగ్ దశలో ఉండగానే ఎఫ్3 సినిమాకి సంబందించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమ్ముడుపోయాయి.ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ ఛానల్ రికార్డ్ ధర కోట్ చేసి హక్కులు సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.ఎఫ్2కి ఉన్న క్రేజ్ నేపధ్యంలో ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం ఎక్కువ మొత్తం చెల్లించడానికి అమెజాన్ ముందుకొచ్చిందని తెలుస్తుంది.ఇక థీయాట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ బిజినెస్ కూడా ఇప్పటికే జరిగిపోయిందని టాక్ వినిపిస్తుంది.

అన్ని కలుపుకొని రిలీజ్ కి ముందే సినిమా వంద కోట్ల బిజినెస్ జరిగిపోతుందనే మాట ఇప్పుడు ఫిలిం నగర్ లో వినిపిస్తుంది.

#Venkatesh #Varun Tej #Dil Raju #Tamannaah #Amazon Prime

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు