కన్నడ నటుడు పునీత్ ఫ్యాన్స్ కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన అమెజాన్.. ఏంటంటే?

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్ 29వ తేదీ గుండెపోటుతో మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే.ఆయన మరణానంతరం ఆయన చేసిన సేవా కార్యక్రమాలు తెలిసి ఎంతోమంది షాక్ అయ్యారు.

 Amazon Prime Surprise Offer To Kannada Actor Puneeth Raj Kumar Fans Details, Puneet, Kannada Hero, Film Industry, Surprise Offer, Amazon, One Cut Two Cut, Family Pack, Man Of The Match, Amazon Prime, Puneeth Raj Kumar, Puneeth Fans-TeluguStop.com

అలాగే మరణం తర్వాత చాలా మంది అభిమానులు ఏదో ఒక రూపంలో ఈయనపై ఉన్న ప్రేమాభిమానాలను బయట పెడుతూ వచ్చారు.ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ పునీత్ రాజ్ కుమార్ కి ట్రిబ్యూట్‌ ఇవ్వబోతుంది.

ఈ క్రమంలోనే కన్నడనాట పునీత్ అభిమానులకు అమెజాన్ ఫ్రీగా సినిమాలు చూసే అద్భుతమైన ఆఫర్ ను ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే పునీత్ రాజ్ కుమార్ నిర్మాణ సంస్థ అయిన పీఆర్‌కే ప్రొడక్షన్‌లో నిర్మితమైన `వన్‌ కట్‌ టూ కట్‌`, `ఫ్యామిలీ ప్యాక్‌`, `మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌` చిత్రాల రిలీజ్ హక్కులను దక్కించుకున్న అమెజాన్ ఈ సినిమాలను అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేస్తూ పునీత్ అభిమానులకు ఈ సినిమాని ఫిబ్రవరి నెల మొత్తం ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించారు.

 Amazon Prime Surprise Offer To Kannada Actor Puneeth Raj Kumar Fans Details, Puneet, Kannada Hero, Film Industry, Surprise Offer, Amazon, One Cut Two Cut, Family Pack, Man Of The Match, Amazon Prime, Puneeth Raj Kumar, Puneeth Fans-కన్నడ నటుడు పునీత్ ఫ్యాన్స్ కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన అమెజాన్.. ఏంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Amazon, Amazon Prime, Pack, Kannada, Puneet, Puneeth Fans, Surprise-Movie

పునీత్ రాజ్ కుమార్ పై ఉన్న అభిమానంతో అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయానికి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ విధంగా అమెజాన్ ప్రైమ్ నటుడు పునీత్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.కేవలం ఈ చిత్రాలు మాత్రమే కాకుండా పునీత్ నిర్మాణ సంస్థలో తెరకెక్కిన మాయాబజార్ 2016, లా, ఫ్రెంచ్ బిర్యాని, కలువు దారి,యువరత్న వంటి సినిమాలను కూడా ఫ్రీగా చూసే అవకాశాన్ని అమెజాన్ కల్పించింది.ఇలా అమెజాన్ పునీత్ అభిమానులకు అదిరిపోయే ఆఫర్లు ఇవ్వడంతో పునీత్ ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube