సరికొత్తగా అద్బుతమైన ఫీచర్లతో అమెజాన్‌ ప్రైమ్‌..!

ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది.కరోనా టైంలో ఓటీటీలే ఎక్కువగా వినోదాన్ని పంచాయి.

 Amazon Prime, New Features, Latest News, Updates, Ott, Movies, Realsed,latest Ne-TeluguStop.com

అందులోనూ అమెజాన్ మరింత మంది ప్రేక్షకులకు దగ్గరయ్యింది.ఇప్పుడున్న చాలా మందికి అమెజాన్ ప్రైమ్ గురించి తెలుసు.

అమెజాన్ ప్రైమ్ ను ఎంచుకుంటే కొత్త కొత్త సినిమాలు, మంచి వీడియోలు, అద్బుతమైన మ్యూజిక్ ను వింటూ ఆనందించొచ్చు.అంతేకాకుండా ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్ లో అత్యంత వేగంగా డెలివరీ చేసేది అమెజాన్ మాత్రమే.

మరి ఇటువంటి అమెజాన్ తమ కస్టమర్ల కోసం అద్బుతమైన ఫీచర్లను తీసుకొస్తూ వారిని ఆనంద పరుస్తుంటుంది.తాజాగా ఓ అద్బుతమైన ఫీచర్ ను అమెజాన్ ప్రైమ్ తీసుకొచ్చింది.

ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మీకు నచ్చిన వెబ్ సిరీస్ కానీ, సినిమాల్లో కానీ ఏదైనా క్యారెక్టర్ ను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవచ్చు.ఈ ఫీచర్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.

ఈ ఫీచర్ ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోని ప్రతి అమెజాన్ కస్టమర్ కి అందుబాటులోకొచ్చింది.

Telugu Amazon Prime, Latest, Ups-Latest News - Telugu

అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రొఫైల్ పిక్ గా ఎన్నో పాపులర్ క్యారెక్టర్ ఫోటోలను ఎంచుకోవచ్చు.అది మాత్రమే కాదు.ఎన్నో వెబ్ సిరీస్ ల్లో నటించిన క్యారెక్టర్లను కూడా తమ ప్రొఫైల్ ఫోటోలుగా ఎంచుకోవచ్చు.

అయితే ఇప్పటి వరకూ అమెజాన్ ప్రైమ్ వీడియోలో హాలీవుడ్ సినిమాలకు చెందిన క్యారెక్టర్లను మాత్రమే ఎంచుకోవచ్చు.త్వరలోనే ఇండియా మూవీస్ లోని క్యారక్టర్లను కూడా ఎంచుకునే అవకాశం రానుంది.

ఇటువంటి ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌, వెబ్‌సైట్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.మీరు కూడా ఇందులో ప్రొఫైల్ పిక్ పెట్టుకోవాలనుకుంటే ముందుగా అమెజాన్ ప్రైమ్ వీడియోను ఓపెన్ చేయాలి.

ఆ తర్వాత హోమ్‌పేజీ కింద మై స్టఫ్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.ప్రొఫైల్ పేరు పైన క్లిక్ చేసిన తర్వాత మేనేజ్‌ ప్రొఫైల్‌ ను ఎంపిక చేసుకోవాలి.

అప్పుడు మీరు మార్చాలనుకునే ప్రొఫైల్‌ ను పెట్టుకోవాలి.అప్పుడు మీ పేరుతో ఉన్న ప్రోఫైల్‌ పిక్ ను చూసి అక్కడ ప్రోఫైల్‌ పిక్‌ పై క్లిక్‌ చేయాలి.

ఆ తర్వాత మీకు నచ్చిన క్యారెక్టర్‌ ను ప్రొఫైల్‌ ఫోటోను ఎంచుకుని సేవ్ చేయాలి.ఇలా ప్రొఫైల్ పిక్ ను మార్చుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube