ఏక్ మినీ కథకి 9 కోట్లు ఆఫర్ చేసిన అమెజాన్ ప్రైమ్

యూవీ క్రియేషన్స్ కొత్త బ్యానర్ యూవీ కాన్సెప్ట్స్ సంతోష్ శోభన్ హీరోగా ఏక్ మినీ కథ మూవీని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.మ్యాంగో మీడియాతో కలిసి లోబడ్జెట్ తో మొదటి చిత్రంగా దీనిని నిర్మించారు.

 Amazon Prime Gives 9 Crore Offer To Ek Mini Katha Movie-TeluguStop.com

మేర్లపాక గాంధీ ఈ సినిమాకి కథని అందించాడు.కార్తిక్ రాపోలు ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.

శ్రద్ధా దాస్ ఓ కీలక పాత్రలో ఈ సినిమాలో నటిస్తుంది. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించింది.

 Amazon Prime Gives 9 Crore Offer To Ek Mini Katha Movie-ఏక్ మినీ కథకి 9 కోట్లు ఆఫర్ చేసిన అమెజాన్ ప్రైమ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది.అడల్ట్ కాన్సెప్ట్ తో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు.

ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలని సంతోష్ శోభన్ వెయిట్ చేస్తున్నాడు.ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది.

అయితే కరోనా సిచువేషన్ కారణంగా వాయిదా పడిపోయింది.

మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి ఈ కాన్సెప్ట్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

అలాగే ఈ జెనరేషన్ యూత్ లో ఉన్న సైజ్ మేటర్ అనే అంశాన్ని హాస్యంతో చెప్పే ప్రయత్నం చేశారు.ఇక థియేటర్స్ లో సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు దీనిని ఒటీటీలో రిలీజ్ చేస్తున్నారు.

అడల్ట్ కామెడీ కావడంతో డిజిటల్ ఆడియన్స్ ని ఈ మూవీ కనెక్ట్ అవుతుందని భావించి అమెజాన్ ప్రైమ్ ఏకంగా తొమ్మిది కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది.వాస్తవానికి ఈ సినిమాకు నిర్మాతలు నాలుగు కోట్లు కూడా వరక ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది.

అయితే అమెజాన్ నుంచి ఏకంగా 9 కోట్ల ఆఫర్ రావడంతో వెంటనే ఒకే చెప్పెసినట్లు తెలుస్తుంది.త్వరలో అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ అఫీషియల్ రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని టాక్.

#UV Concepts #EkMini #Kavya Thapar #Amazon Prime #Santosh Sobhan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు