సలార్ కి అమెజాన్ ప్రైమ్ నుంచి భారీ ఆఫర్... ఇప్పటి వరకు ఏ హీరోకి లేదు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలని లైన్ లో పెట్టి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతని సొంతం చేసుకున్నాడు.ఇప్పటి వరకు ఇండియాలో సినిమా అంటే ప్రాంతాల వారీగా, బాషల వారీగా విడిపోయి ఉంది.

 Amazon Prime Gives 100 Crore Offer To Salaar Digital Right-TeluguStop.com

అయితే బాహుబలితో రాజమౌళి ప్రాంతాల మధ్య, బాషల మధ్య దూరం చెరిపేసి ఏకంగా ఏడు బాషలలో సినిమాని రిలీజ్ చేశాడు.ఇప్పుడు అదే జోరుని డార్లింగ్ ప్రభాస్ కొనసాగిస్తున్నాడు.

బాహుబలి, సాహో సినిమాలతో ఆల్ ఇండియా రేంజ్ లో తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో పాటు మార్కెట్ క్రియేట్ అవడంతో తన సినిమాలు అన్ని పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండే విధంగా చూసుకుంటున్నాడు.ఈ నేపధ్యంలో ప్రస్తుతం చేస్తున్న ఆది పురుష్, సలార్, నాగ్ అశ్విన్ సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకేక్కుతున్నాయి.

 Amazon Prime Gives 100 Crore Offer To Salaar Digital Right-సలార్ కి అమెజాన్ ప్రైమ్ నుంచి భారీ ఆఫర్… ఇప్పటి వరకు ఏ హీరోకి లేదు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలీవుడ్ స్టార్స్ తో కూడా ఇప్పటి వరకు 200 కోట్ల బడ్జెట్ దాటి సినిమాలని నిర్మాతలు తీయలేదు.కాని ప్రభాస్ కోసం 200 నుంచి 500 కోట్ల వరకు బడ్జెట్ పెట్టడానికి రెడీ అయిపోతున్నారు.

ఎంత పెట్టిన రిలీజ్ కి ముందే బిజినెస్ అయిపోతుందనే ధీమాతో నిర్మాతలు ప్రభాస్ మీద ఈ సాహసం చేస్తున్నారు.దానికి తగ్గట్లే అతని సినిమాలకి ప్రీరిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతుంది.

ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీకి కూడా అలాగే బిజినెస్ జరుగుతుంది.ఈ సినిమా ఇంకా ఒక షెడ్యూల్ మాత్రమే పూర్తి చేసుకుంది.అయితే ఒటీటీ చానల్స్ ఇప్పటి నుంచి సలార్ కోసం పోటీ పడుతున్నాయి.ఈ రేస్ లో అమెజాన్ ప్రైమ్ ముందు వరుసలో ఉంది.

సలార్ అన్ని బాషల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ నిర్మాతలకి ఏకంగా వంద కోట్ల వరకు ఆఫర్ చేశారని తెలుస్తుంది.హోంబలే ఫిలిమ్స్ సలార్ సినిమాని 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుంది.

అయితే ఇప్పుడు డిజిటల్ రైట్స్ ద్వారా 75 శాతం పెట్టుబడి వెనక్కి వచ్చేస్తున్నట్లు ఈ ఆఫర్ చూస్తుంటే తెలుస్తుంది.ఇక శాటిలైట్, థీయాట్రికల్ రైట్స్ రూపంలో మరింత్ బిజినెస్ జరిగే అవకాశం ఉంది.

.

#100 Crore #SalaarDigital #Amazon Prime #Prasanth Neel #Darling Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు